Vadde Naveen | 1996లో వచ్చిన క్రాంతి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా పాపులర్ అవ్వకపోయినా..ఆ తర్వాత 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో వడ్డే నవీన్… హిట్ కొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో నవీన్‌కు వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు , లవ్ స్టోరీ 1999 స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ , ప్రేమించేమనసు, మా బాలాజీ , చాలా బాగుంది, బాగున్నారా మా ఆవిడమీదొట్టు – మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది , అయోధ్య (సినిమా), ఆదిలక్ష్మి , నా ఊపిరి ఎటాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు.
వడ్డే నవీన్ మొదట వివాహం
నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగులో చాలా సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దంతా పక్కన పెడితే 2010 వ సంవత్సరం వరకు వడ్డే నవీన్ యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఆయన మార్కెట్ 2003 వ సంవత్సరం లోనే పూర్తిగా పోయింది. అయినా కూడా ఈయనతో సినిమాలు చేసే వాళ్ళు ఉండేవారు. అలా 2010 వరకు కెరీర్ ని నెట్టుకొచ్చిన ఆయన, ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయాడు. మళ్ళీ 2016 వ సంవత్సరంలో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఎటాక్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక వడ్డే నవీన్ సినిమాల గురించి చాలామందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా వడ్డే నవీన్ కు టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో బావమరిది అవుతాడు అన్న సంగతి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే మొదట వివాహం చేసుకున్నాడు.నందమూరి తారక రామారావు కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ మొదట వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. అంతేకాకుండా వ్యక్తిగత సమస్యల వల్లే వడ్డె నవీన్ సినిమాలకు దూరమయ్యారని కూడా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
Also Read : అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్ ,
త్వరలో విలన్ గా
తాజాగా బిగ్‌బాస్ జాబితాలో హీరో వడ్డె నవీన్ కూడా చేరాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన నవీన్ చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. సినిమాల్లో తప్ప మరే ఈవెంట్‌లోనూ నవీన్ కనిపించడు. వాడే నవీన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా చాలా మందికి తెలియదు.అయినప్పటికీ ఆయన సినిమాలు ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్ కు మహిళా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే వడ్డే నవీన్‌ని సీజన్ సిక్స్‌లో భాగానికి ఆహ్వానించారు బిగ్‌బాస్. షోలో పాల్గొనేందుకు నిరాకరించినట్లు సమాచారం. తర్వాత ఒప్పించి భారీ రెమ్యునరేషన్ ఇచ్చాడు. ఇదే నిజమైతే ఆరో సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు.
ఇక పోతే ఇప్పటికే సుమన్, జగపతిబాబు వంటివారు విలన్ పాత్రల్లో రాణిస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలో మరో్ హీరో చేరుతున్నారు. అయితే, అమాయకమైన మొఖంతో కనిపించే ఆ హీరోను విలన్ గా ఊహించడానికే ఆశ్చర్యమేస్తోంది. పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, నా ఊపిరి వంటి చిత్రాలల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ త్వరలో విలన్ గా కనిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నవీన్ విలను పాత్ర పోషించనున్నట్లు సమాచారం. శ్రీమతి కళ్యాణం చిత్రం తర్వాత వడ్డే నవీన్ ఏ చిత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు విలన్ గా రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే శ్రీకాంత్( Srikanth ) హీరోగా రాశి హీరోయిన్ గా వచ్చిన ‘ప్రేయసి రావే ‘సినిమాలో మొదట హీరోగా వడ్డే నవీన్ ను తీసుకోవాలని అనుకున్నారు.కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమాలో మళ్ళీ శ్రీకాంత్ హీరోగా చేయాల్సి వచ్చింది.అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన చంద్ర మహేష్ మొదట నవీన్ ను హీరోగా తీసుకుందామని అనుకున్నారట.కానీ డాక్టర్ డి రామానాయుడు మాత్రం శ్రీకాంత్ అయితే బాగుంటాడు అని చెప్పడంతో శ్రీకాంత్ ను తీసుకొని ఈ సినిమాని చేశారని అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇక ఈ సినిమాని కనక వడ్డే నవీన్ చేసినట్లయితే ఆయన కెరియర్ లో ఒక మంచి హిట్ అయితే పడేది.
విడాకులు ఇచ్చేసి మరో వివాహం
ఇక ప్రేయసి రావే సినిమాతో శ్రీకాంత్ సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా అప్పటివరకు ఫ్లాప్ ల్లో ఉన్న ఆయనకి ఒక మంచి హిట్ సినిమా అయితే పడిందనే చెప్పాలి… ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా శ్రీకాంత్ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.అవును.. నందమూరి ఫ్యామిలీకి చెందిన మహిళతో ఏడడుగులు వేశారు. వడ్డే నవీన్ మొదటి భార్య.. నందమూరి ఇంటి ఆడపడుచు. వడ్డే, నందమూరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్‌కి ఇచ్చి వివాహం చేశారు పెద్దలు.
ఆమె నందమూరి బాలకృష్ణకు కూతురు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు సోదరి వరస అవుతుంది.ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురినే వడ్డె నవీన్ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మన జూనియర్ ఎన్టీఆర్ కు వడ్డె నవీన్ బావ అవుతాడు.గతంలో వీళ్ళు బాగా సన్నిహితంగా కూడా ఉండేవారట. తన అక్క వడ్డె నవీన్ భార్య అయిన చాముండేశ్వరితో కూడా ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది.అయితే కొన్నాళ్ల తరువాత చాముండేశ్వరి,వడ్డే నవీన్ లు విడిపోయారు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చేసి మరో వివాహం చేసుకున్నాడు నవీన్. ‘మనసిచ్చి చూడు’ ‘చాలా బాగుంది’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నవీన్ నటించాడు.అయితే తరువాత ఇతనికి వరుస పరాజయాలు ఎదురవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చివరిగా ఇతను మనోజ్ నటించిన ‘ఎటాక్’ చిత్రంలో నటించాడు.
Also Read : శోభన్‌బాబు, జయలలిత పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే .. ?
ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి..
తాజాగా నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సునీల్, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహా, రోజా, శివాజీ రాజా, నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్‌ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వడ్డే సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ మద్యనే వడ్డే నరేశ్ నిర్మాత వడ్డే రమేష్ ఈ రోజు హైదరాబాద్ లో మరణించారు. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో భాదపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిర్మాత వద్దే రమేష్ హీరో వడ్డే నవీన్ కి తండ్రి.నిర్మాత వడ్డే రమేష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని పాపులాస్ సినిమాలను నిర్మించాడు. ఎన్.టి.ఆర్ గారితో ‘బొబ్బులి పులి’, కృష్ణం రాజుతో ‘కటకటాల రుద్రయ్య’, చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ లాంటి కొన్ని సినిమాలను నిర్మించారు. అలాగే రాజశేఖర్ హీరోగా ‘అమ్మ కొడుకు’ సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు.వడ్డే రమేష్ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి, ఈ విషయం విన్న సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు.
ఇక ఈ మధ్య కాలంలో వడ్డే నవీన్ ఎటాక్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సినిమా వచ్చిన విషయం కూడా ఎంతో మంది ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి. అయితే వడ్డే నవీన్ తన కెరీర్లో కథల ఎంపిక దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగానే కెరీర్ మొత్తం ఫ్లాప్ అయింది అని తెలుస్తోంది. ఇలా వడ్డే నవీన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ సినిమాలు మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. కొన్ని సినిమాలు విజయం సాధించిన అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం పలు వ్యాపార తో బిజీగా ఉన్నాడు వడ్డే నవీన్. ఏది ఏమైనా ఈ నిన్నటితరం హీరో ఒక్కసారైనా మీడియా ముందుకు రాకపోతాడా అని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.
ఓ వెలుగు వెలిగి ఇప్పుడు
వీన్ చివరగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమలో కనిపించారు. వడ్డే నవీన్ కనీసం బయట ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వడ్డే నవీన్ హీరోగా ఫెడ్ అవుట్ అవ్వడానికి మెయిన్ రిజైన్.. ట్రెండ్ కి తగ్గట్టుగా కథలు ఎంచుకోకపోవడమే అని చెప్పాలి. అన్నీ ఒకే మూస ధోరణిలో వెళ్ళే కథలను నవీన్ ఎంచుకున్నాడు. 2001 తర్వాత నవీన్ చేసిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. వరుసగా సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో హీరోగా వడ్డే నవీన్ ఫెడ్ అవుట్ అయిపోయాడు. కనీసం టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ మధ్య ఆయన కుమారుడి ధోతీ ఫంక్షన్ లో కనిపించాడు నవీన్. ప్రస్తుతం బిజినెస్ పనులను చూసుకుంటున్నాడు.
ఆ మధ్య ఒక ల్యాండ్ ఇష్యూలో వార్తల్లో కనిపించారు. క్రిష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తన భూ సమస్యని పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. తిరువూరు నియోజక వర్గం మాధవరంలో తన తల్లికి సంబంధించిన భూమిని భూసేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుందని అయితే నష్టపరిహారం అందచేయలేదని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు వడ్డే నవీన్.మంచి నటనతో సినిమాల్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కనిపించకపోవడంతో ఆయన అభిమానులు అతని కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి దూరమైన ఎంతో మంది నటీనటులు అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో కనిపిస్తుండటంతో.. దయచేసి నవీన్‌ని ఈ కార్యక్రమానికి తీసుకుని రావాలని గత కొన్నేళ్లుగా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.