Actress Priyamani | | ప్రియమణి అసలు పేరు.. ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరును షార్ట్ కట్ చేసి ప్రియమణిగా కొనసాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమై న క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో ప్రియమణి ఒకరు . ఈ నటి జగపతి బాబు హీరో గా రూపొంది న పెళ్లయిన కొత్తలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొద టి విజయాన్ని అందుకొని ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తరువాత ఈ బ్యూటీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యమదొంగ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది..ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈనటి క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగింది.ఆ తర్వాత ఈమె చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ప్రియమణి అనే ఇతర భాష సినిమాల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.
మతాంతర పెళ్లి
హీరోయిన్ గా తన కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే 2017లో ముస్తఫా రాజాను పెళ్లిచేసుకుంది. అతడు ముస్లిం మతస్తుడు. ఇక అప్పటినుంచి తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ.. ముస్లిం మతాన్ని కూడా గౌరవిస్తూ రంజాన్ వేడుకలను కూడా జరుపుకుంటూ ఉంటుంది.ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ప్రియమణిని పెళ్లి చేసుకోకముందే ఆయనకి పెళ్లి అయిపోయింది. ఓ భార్య కూడా ఉంది. ఆమె పేరు అయేషా. అంతేకాదు వీళ్లకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక ఆ తరువాత ప్రియమణి తో మళ్లీ లవ్ లో పడి .. 2017లో ప్రియమణిని రెండో వివాహం చేసుకున్నాడు.జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా తన కుటుంబానికి, లేదంటే తన భర్తకు సమాధానం చెప్పుకొంటాను తప్ప వేరొకరికి సమాధానం చెప్పనని ప్రియమణి తెలిపింది.
Also Read : ఐదేళ్ల వయసులోనే పెళ్లి.. ఇప్పుడు 2 కోట్ల ఆస్తి …
తన గురించి మీడియాలో అవాస్తవాలు ప్రచారమైతే వాటిని గాలికి వదిలేయడమే తప్ప పట్టించుకోనని ప్రియమణి చెప్పింది.ఇక చివరగా ‘భామా కలాపం’లో అనుపమాలా నిజ జీవితంలో ఉండాలని అనుకోవడం లేదని ప్రియమణి. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నాడని.. ఏమాత్రం తీరిక దొరికినా కూడా వెంటనే వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటామని తెలిపింది ప్రియమణి. కుదరకపోతే కనీసం హాయ్ బాయ్ అంటూ మాట్లాడుకుంటామంటుంది. తమ బంధం గురించి అనుమానాలు వ్యక్తం చేసే వాళ్లకు ఒకటే విషయం చెబుతున్నాను అంటోంది ప్రియమణి. తాము చాలా అన్యోన్యంగా ఉన్నామని.. ఎలాంటి గొడవలు లేవు.. ప్రేమగా ఉన్నాం ఎలాంటి విషయమైనా కలిసి పంచుకుంటాం అంటుంది ఈమె.
భర్తతో విబేధాలు..
నిజానికి గత కొద్ది రోజులుగా ప్రియమణి తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. గతంలో ముస్తఫాకు నేను విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికి నేను అతని భార్యనే అని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సంఘటన తర్వాత ప్రియమణి- ముస్తాఫాకు గొడవ జరిగిందని, త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రియమణి పెట్టిన పోస్ట్ పుకార్లన్నింటికి అడ్డుకట్ట వేసింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ప్రియమణి కనిపించగా, ఈ ఫొటోతో వారి విడాకులపై పూర్తి క్లారిటీ వచ్చింది.
తొలి రోజుల్లో
ఇదిలా ఉంటే కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రల్లో నటించిన ప్రియమణి ప్రస్తుతం పూర్తిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.తాజాగా ఇదే అంశంపై మీడియాతో ముచ్చటించిన ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. కొన్నేళ్ల నుంచి ముద్దు సీన్స్‌లో నటించడం ఆపేశానని చెప్పుకొచ్చింది. దీనికి గల కారణాన్ని వివరించిన ప్రియమణి.. పెళ్లి తర్వాత కిస్సింగ్ సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది.
అది ఒక పాత్రే అయినప్పటికీ.. వ్యక్తిగతంగా తాను దాని వల్ల ఇబ్బంది పడతానని తెలిపింది. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే భర్తకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రియమణి అభిప్రాయపడింది.ఇక ఈ విషయమై ప్రియమణి ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లైన 2017 తర్వాత నుంచి ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. సినిమా ఓకే చేసేముందే ఈ విషయాన్ని చెబుతున్నాను. నేను నటించే సినిమాలను మా ఇరు కుటుంబ సభ్యులు చూస్తారు. అలాంటి వాటి వల్ల వాళ్లు ఇబ్బందిగా ఫీలవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పికొచ్చింది ప్రియమణి.
Also Read : అక్కినేని అఖిల్ కి 2000 కోట్ల కట్నం.. ఏంది సామి ఇది …
కారు ఖరీదు ..
తాజాగా ప్రియమణి జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీ.ఎల్.సీని కొనుగోలు చేశారు. కొత్త కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియమణి దగ్గర కొన్ని ఖరీదైన కార్లు ఉండగా తాజాగా అమె గ్యారేజ్ లో మరో కారు చేరడం గమనార్హం.ప్రియమణి (Priyamani) వయస్సు 39 సంవత్సరాలు కాగా మరికొన్ని సంవత్సరాల పాటు ప్రియమణికి ఆఫర్ల విషయంలో ఎలాంటి సమస్య ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రియమణి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదని సినిమా బడ్జెట్ కు అనుగుణంగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
అతను అంటే పిచ్చి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే ప్రియమణికి చచ్చేంత పిచ్చట . ఎంతలా అంటే చిన్నతనం నుండి ఆయన సినిమాలను చూస్తూనే పెరిగానని ..ఆయన కోసం కాలేజ్ డేస్ లో ఎగ్జామ్స్ కూడా ఎగ్గొట్టి మరి సినిమాలకు వెళ్లాలని చెప్పుకొచ్చింది .అంతేకాదు ఆయనతో నటించే ఛాన్స్ అందుకున్నప్పుడు ఎగిరి గంతేసిందట. మనకు తెలిసిందే షారుక్ ఖాన్ – దీపిక పదుకొనే జంటగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది ప్రియమణి .ఈ పాట సూపర్ హిట్ అయింది .
ఈ పాట కోసం ఏకంగా ఐదు రాత్రులు ఆయన కోసం కష్టపడిందట . ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలోనే షారుక్ ఖాన్ తాను కలిసి ఐపాడ్ లో కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం చేసామని ..ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న 300 రూపాయలు నాకు ఇచ్చేసాడని.. ఇప్పటికే ఆ డబ్బులు నా దగ్గర భద్రంగా దాచుకున్న అని తెలియజేసింది . అంతేకాదు ఆయన అంటే చచ్చిపోయేంత ఇష్టం అంటూ కూడా ఓపెన్ అప్ అయింది . ఇప్పటికే ఆయన సినిమాలను లేట్ నైట్స్ కూడా పెట్టుకొని చూస్తూ ఉంటుందట.
విద్యాబాలన్‌తో రిలేషన్..
హీరోయిన్ ప్రియమణి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌తో తనకున్న రిలేషన్‌ను బయట పెట్టింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమని..విద్యాబాలన్, నేను కజిన్స్ అని పేర్కొంది. అలాగని మేం తరచూ కలుసుకునేదేమీ లేదు. మా తల్లిదండ్రులు వారిని కలిసినది లేదు. కానీ రిలేషన్ మాత్రం ఉంది అని ప్రియమణి చెప్పింది.అంతేకాదు, విద్యాబాలన్ నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకుందని ప్రియమణి చెప్పుకొచ్చింది.
అలాంటి ఆఫర్స్ నాకు వద్దు..
స్టార్ హీరోయిన్లు ఈమధ్య కాలం లో ఎక్కువగా జిమ్ వర్కౌట్స్ చేసి బయటకి వస్తూ ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులు ఇవ్వడం వంటివి మనం గమనిస్తూనే ఉంటాం. ఇదంతా చూసి మనలాంటి వాళ్ళు, వీళ్ళకి ఎంత క్రేజ్ ఉందో అని అనుకుంటుంటాం. కానీ దీని వెనుక పెద్ద కథ దాగుంది అని ప్రియమణి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్ లో ఎప్పటి నుండో ఒక ట్రెండ్ ఉంది. సోషల్ మీడియా లో హీరోయిన్లు జిమ్ నుండి బయటకి వస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు, వీడియోలు తియ్యడం మనం గమనిస్తూనే ఉంటాం. అవన్నీ డబ్బులు ఇచ్చి స్వయంగా హీరోయిన్స్ ఫోటోగ్రాఫర్స్ ని పిలిపించుకొని చేయించుకుంటారు. పూజా హెగ్డే, జాన్వీ కపూర్, రాశీ ఖన్నా వంటి హీరోయిన్లు అదే చేస్తారు. నాకు కూడా అలాంటి ఆఫర్స్ వచ్చాయి కానీ, నేను అందుకు అంగీకరించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.
Also Read : ఉదయ భాను కొత్త ఇల్లు చూస్తే ఇంద్రభవనమే..
ప్రియమణి ఫస్ట్ రెమ్యూనరేషన్..
ఇకపోతే ప్రస్తుతం ఒక్కో సినిమాకు ప్రియమణి కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన మొదటి రెమ్యూనరేషన్ గురించి పలు విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ తాను మొదట అందుకున్న రెమ్యూనరేషన్ 500 రూపాయలని తెలియజేశారు.అయితే తన మొదటి రెమ్యూనరేషన్ గా తీసుకున్నటువంటి ఈ డబ్బులను ఇప్పటికీ నా వద్ద అలాగే భద్రంగా ఉంచుకున్నానని ప్రియమణి తెలిపారు.ఇలా 500 రూపాయలతో మొదలైనటువంటి తన ప్రయాణం ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇంకా పోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియమణికి ఎలాంటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. అంతేకాదు జ్యోతిక కూడా ఇప్పుడు పలు సినిమాలతో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడు ఎవ్వరు అడిగిన అందరు డైరెక్టర్ చూస్ చేసుకునేది ఇద్దరి పేర్లు .. కొంచెం హై రేంజ్ లో డిమాండ్ చేస్తుందట .ప్రియమణి మాత్రం సింపుల్ గా మేకర్స్ ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటుందట. ఈ మధ్యకాలంలో ప్రియమైన బడా బడా సినిమాలలో వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది.
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రాజెక్టు కోసం ముందుగా జ్యోతికను అప్రోచ్ అయ్యారట. అయితే జ్యోతిక హై రెమ్యూనరేషన్ అడగడంతో ప్రియమణి దగ్గరకు వెళ్లి సినిమాకి కమిట్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారట . ఈ విషయం తెలుసుకున్న జ్యోతిక ప్రియమణి కంటే తక్కువకే ప్రాజెక్టు చేయడానికి ఓకే చేసిందట. గతంలో రెండు సినిమాలను జ్యోతిక వదిలేసుకోవడం అవి ప్రియమణి ఖాతాలో పడడం సంచలనంగా మారింది . దీంతో ప్రియమణి దెబ్బకు జ్యోతిక దిగి వచ్చింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.