Manchu Family | మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములుకాదని మీకు తెలుసా ..

Written by admin

Updated on:

Manchu Family | మంచు మోహన్ బాబు అని పిలవబడే మంచు భక్తవత్సలం నాయుడు బహుముఖ తెలుగు నటుడు, రాజకీయవేత్త, విద్యావేత్త, పరోపకారి, దర్శకుడు మరియు నిర్మాత. 575కి పైగా సినిమాల్లో నటించడం నుండి 63కి పైగా హిట్‌లను నిర్మించడం వరకు, ప్రజా నాయకుడిగా మరియు పేరుపొందిన రాజకీయ నాయకుడిగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపం, సాధ్యమైన ప్రతి విధంగా, అనేకమంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచింది మరియు మన దేశానికి ఆదర్శవంతమైన పౌరుడిగా ఉంది.మంచు మోహన్ బాబు తిరుపతికి సమీపంలోని మోదుగులపాలెం అనే చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్ బాబుకు కళాకారుడు కావాలనే దాహం ఎప్పుడూ ఉండేది మరియు చాలా చిన్న వయస్సులోనే అతనికి సినిమాలంటే క్రేజ్ ఏర్పడింది.

Manchu Family

మోహన్ బాబు రెండో పెళ్లి

కుటుంబాన్ని పోషించాల్సి రావడంతో ప్రధానోపాధ్యాయుడైన తండ్రి సలహా మేరకు చెన్నైలోని ఓ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కానీ అది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరాలనే అతని దాహాన్ని తగ్గించలేదు, కాబట్టి అతను YMCA నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీని సాధించడానికి మద్రాసుకు బయలుదేరాడు మరియు చెన్నైలోని కేసరి ఉన్నత పాఠశాలలో P Ed ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతను నిర్మలా దేవిని వివాహం చేసుకున్నాడు మరియు ముగ్గురు పిల్లలు – లక్ష్మి మంచు, విష్ణు మంచు మరియు మనోజ్ కుమార్ మంచు. ఆయన పిల్లలందరూ ఈ రోజు తెలుగు పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఉన్నారు మరియు నటులుగా మరియు వ్యవస్థాపకులుగా స్థిరపడ్డారు.

మొదట మోహన్ బాబు 1975లో తన కెరీర్‌ను ప్రారంభించాడు మరియు అతని తొలి చిత్రం శివరంజని అతని ప్రధాన పురోగతి. అతను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుచే కనుగొనబడ్డాడు, తరువాత అనేక చిత్రాలకు అతనితో జతకట్టాడు, తమను తాము తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఇష్టమైన జంటగా మార్చుకున్నారు.ఆ తరువాత ఎంతటి పెద్ద డైలాగ్స్ నైనా సరే.. గుక్క తిప్పుకోకుండా.. నోటితో అలవోకగా చెప్పే యాక్టర్ మన మోహన్ బాబు అనే చెప్పాలి. అందుకే కాబోలు ఆయనకి డైలాగ్ కింగ్ అనే బిరుదు కూడా ఇచ్చారు ప్రేక్షకులు.ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉన్నాయి.

మోహన్ బాబుకు ముందుగా విద్యా దేవితో వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి -మంచు విష్ణు. మోహన్ బాబు – విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగా ఛాన్సులు లేనప్పుడు.. ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పే వారట. ఒకరోజు మోహన్ బాబు ఇంటి అద్దె కట్టటం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విసర్జన చేశాడట. ఆరోజు మోహన్ బాబు విద్యాదేవి ఇంట్లోకి వెళ్లి ఏడ్చారట. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్పారు.ఆ సమయంలో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించే వారట. అలా సినిమాల్లో బిజీ కావడంతో సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట.

దీంతో భార్య విద్యాదేవిని కూడా ఆయన సరిగా పట్టించుకునే వారు కాదు. పిల్లలను కూడా పట్టించుకునేందుకు ఆయనకు తీరిక ఉండేది కాదట. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో క్షణికావేశంలో విద్యాదేవి బలవ*రణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విష్ణు- లక్ష్మీ ఇద్దరూ కూడా చిన్న పిల్లలు.అనంతరం మోహన్ బాబు విద్యా దేవి సోదరినే రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ మనోజ్ జన్మించాడు. ఇక మోహన్ బాబు తన విద్యా సంస్థలకు మొదటి భార్య పేరునే పెట్టారు.ప్రస్తుతం నిర్మాతగా, విద్యాసంస్థల డైరెక్టర్ గా మరియు నటుడిగా కొనసాగుతున్నారు.

కూతురు గురించి

మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న అందరికీ సుపరిచితమే.మొదట్లో పలు టాక్ షోలకు హోస్ట్ గా చేసింది. అవి సక్సెస్ అయ్యాయి. కెమెరా అంటే భయం పోగొట్టుకోవడానికి, కెమెరాని ఫేస్ చేసే ధైర్యం కోసమని ఆ టాక్ షోలు చేస్తూ వచ్చింది. అటు తర్వాత అడపా దడపా సినిమాల్లో కూడా నటించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘దొంగాట’ ‘మాన్స్టర్’ వంటి సినిమాలు నటిగా మంచు లక్ష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే మంచు లక్ష్మీ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈమె వ్యక్తిగత జీవితం గురించి తెలీకుండానే ఈమెను ట్రోల్ చేసే బ్యాచ్ ఉన్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే.. మంచు లక్ష్మీ తన భర్తతో విడిపోయింది అంటూ చాలా మంది అనుకుంటారు.ఇప్పటికీ ఆమె లక్ష్మీ మంచుగానే పిలువబడుతుండడంతో ఈమె విడాకులు తీసుకోవడంతో అలా పిలుస్తున్నారని అంతా అనుకుంటారు. పెళ్లి అయినా లక్ష్మీ తన ఇంటి పేరును మార్చుకోకపోవడం,తన కూతురితో కలిసి హైదరాబాద్ లోనే ఉంటూ కెరీర్ కొనసాగిస్తుండడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. లక్ష్మీ ప్రసన్న భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఇతను అమెరికాలో ఉంటున్నారు.కానీ లక్ష్మీతో విడిపోలేదు.ఇటీవల జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్లి లో ఆండీ శ్రీనివాసన్ కూడా దర్శనమిచ్చాడు. లక్ష్మీ పక్కనే ఆండీ ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

విష్ణు భార్య జ‌గ‌న్‌కు చెల్లి..

మోహన్ బాబు పుత్రరత్నాల్లో మంచు విష్ణు చాలా డిఫరెంట్. మనోజ్, మంచులక్ష్మి మోడ్రన్ స్కూల్ టైప్ అయితే విష్ణు ఓల్డ్ స్కూల్. తండ్రిచాటు బిడ్డగా చాలా పద్దతిగా కనిపిస్తుంటారు. మాట్లాడే విధానం ప్రవర్తించే తీరు.. పెళ్లి, పిల్లలు ఇవన్నీ కూడా రాముడు మంచి బాలుడు అన్నట్టుగానే ఉంటాయి. అన్నట్టుగా కాదు.. నేను ఆ టైపే అంటున్నారు మంచు హీరో.ప్రస్తుతం కన్నప సినిమా లో చాలా బిజీగా ఉన్నారు . ఇంకా విష్ణు విషయానికి వస్తే విరానికా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెల్లి. జ‌గ‌న్ చివ‌రి చిన్నాన్న ( రాజారెడ్డి నాలుగో కొడుకు) సుధాక‌ర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపుతుల కుమార్తె. చిన‌ప్ప‌టి నుంచే ఆమె ఎక్కువుగా అమెరికాలో ఉన్నారు.

చిన్న‌త‌నంలో ఆమెకు డాక్ట‌ర్ కావాల‌న్న కోరిక ఉండేది. ఆ త‌ర్వాత ఆమె వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె వ్యాపారంలోకి ఎంట‌ర్ అయిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.రాజారెడ్డి కుటుంబంలో చిన్న మ‌న‌వ‌రాలిగా వెరానికా రెడ్డి అంటే అంద‌రికి గారాబం. ఆమెకు ఆఫ్రికాలోనూ, అమెరికాలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఇటు భ‌ర్త సినిమా నిర్మాత‌గాను, అమెరికాలో వ్యాపారాల‌తో పాటు అక్క‌డ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ కూడా ర‌న్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమెకు విష్ణు ప‌రిచ‌యం అయ్యాక‌, ఆమె మాట తీరు, మ‌ర్యాద కంటే కూడా ఆమెలో ఉన్న బిజినెస్ ల‌క్ష‌ణాల‌కు విష్ణు ముగ్ధుడు అయిపోయి ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ట‌.ప్రస్తుతం ఈ జంటకు 4 సంతానం,Manchu Family

Also Read : నట ప్రస్తావనకు 56 ఏళ్ళు.. ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా ,

ఇద్దరికీ ఇది రెండో వివాహమే..

హీరో మంచు మనోజ్…ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నెగిటివ్ రోల్స్ తో కెరీర్ ను ప్రారంభించి.. ఆ తరువాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మనోజ్ మొదట ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ కొన్ని కారణాల చేత వారు విడిపోయారు,మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది మార్చి 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. వివాహానికి ముందు నుంచి వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.

ఇక మంచు మనోజ్, మౌనికా రెడ్డి… ఇద్దరికీ ఇది రెండో వివాహమే.ఆల్రెడీ ఆమెకు ఓ బాబు ఉన్నారు.దాదాపు కొన్నేళ్లుగా మంచు మనోజ్ వెండి తెరపై కనిపించలేదు. సినిమాలు తీయలేదు. అయితే, పెళ్లయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారనే వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ, బుల్లితెరలో మాత్రం రఫ్ ఆడిస్తున్నాడు మనోజ్. ‘ఉస్తాద్’ ప్రోగ్రామ్కు ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మళ్లీ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘వాట్ ది ఫిష్’. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Manchu Family

Manchu Family

మోహన్‌బాబు మొత్తం ఆస్తులు

సినిమాల ద్వారా మోహన్ బాబు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని వార్త వినిపిస్తోంది మోహన్ బాబు మొత్తం ఆస్తి విలువ దాదాపు గా రూ.425 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబుకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయని వాటి విలువ భారీగానే ఉన్నట్లు సమాచారం.మోహన్ బాబు పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులుగా పెట్టి ప్రతి సంవత్సరం రూ. 60 కోట్ల రూపాయలకు పైగా లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. సొంత ఊరిలో మోహన్ బాబుకు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన ఇల్లు తో పాటు పొలాలు ,భూములు కూడా ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటి గురించి ప్రచారం చేసుకోరు. ఇక ఈయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నది. ప్రస్తుతం ఇద్దరు హీరోలు సైతం హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఆస్తుల వివాదం

మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రచ్చ రేపుతోంది. తండ్రికొడుకులు మోహన్‌బాబు, మంచు మనోజ్ ఒక‌రిపై ఒక‌రు పోలీసుల‌కు కంప్లెంట్ చేశారు. దాంతో మంచు మ‌నోజ్‌, మంచు మోహ‌న్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేశారు మోహ‌న్‌బాబు ఫిర్యాదుతో మంచు మ‌నోజ్‌, అత‌ని భార్య భూమా మౌనికపై 329, 351 సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. నా కొడుకు నుండి నాకు ప్రాణహాని ఉంది నన్ను రక్షించండి అంటూ రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు.

ఇవాళ ఉద‌యం మంచు విష్ణు దుబాయి నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. జ‌ల్‌ప‌ల్లిలోని ఇంటికి వెళ్లే మార్గ‌మ‌ధ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.త‌మ కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని, త్వ‌ర‌లోనే అన్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్ద‌గా చిత్రీక‌రించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న తెలిపారు. అయితే, ఈ గొడవలన్నీమోహన్ బాబు జల్ పల్లిలో నిర్మించుకున్న విశాలమైన ఇంటి కోసమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.Manchu Family

🔴Related Post

Leave a Comment