Jr NTR | మొదట నందమూరి తారకరామారావు మనవడి, హరికృష్ణ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరుని నిలబెట్టే మనవడిగా నందమూరి తారక రామారావు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. యంగ్ టైగర్‌గా, మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌గా ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించారు ఎన్టీఆర్. ఆ తర్వాత బాల రామాయణంలో నటించారు. 2001లో నిన్ను చూడాలని అనే మూవీతో హీరోగా తెరంగేట్రం చేశారు. కానీ, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెం.1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అక్కడ నుంచి మొదలైన ఎన్టీఆర్ సినీ జర్నీ సక్సెఫుల్‌గా కొనసాగుతోంది.
తారక్ రాముడి కెరియర్
స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్ చేసిన ‘సుబ్బు’ బాక్సాఫీసు వద్ద సరైన రిజల్ట్ ఇవ్వలేదు. అయినా ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన ‘ఆది’ సూపర్ డూపర్ హిట్టయింది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగులు ..ఎన్టీఆర్ కు మాస్ లో తిరుగులేని ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఈ మూవీ సక్పెస్ తో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తన స్టామినా ఏంటో చూపించారు జూనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత బి.గోపాల్ డైరెక్షన్ లో జూనియర్ చేసిన ‘అల్లరి రాముడు’ పర్వాలేదని పించింది. నెక్స్ట్ కాలేజీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘నాగ’ లో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా నటించాడు.
ఈ మూవీ నిరాశ పరిచినా తారక్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో చేసిన సింహాద్రి తో ఎన్టీఆర్ కెరీర్ కొత్త పుంతలు తొక్కింది.ఈ చిత్రంలో తారక్ హావభావాలు, యాక్షన్, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ మూవీ సాధించిన విజయంతో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా స్థిరపడ్డాడు.ఆ తరువాత యమదొంగ వినాయక్ డైరెక్షన్లో చేసిన ‘అదుర్స్’ తో యాక్టర్ గా మరో మెట్టెక్కాడు. ఈ సినిమాలో రెండు విభిన్నపాత్రల్లో వైవిధ్యనటన కనబరిచి.. అందరిచేత అదుర్స్ అనేలా చేశాడు జూనియర్.
ఈ మూవీలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అందరినీ నవ్వించింది. ఈ మూవీతో తాను హాస్యపాత్రలు సైతం బాగా చేయగలనని నిరూపించుకున్నాడు.జనతా గ్యారేజ్ టెంపర్ వంటి అనేక హిట్ సినిమాలు తో తారక్ ఒక మాస్ బ్రాండ్ గా ఎదిగారు తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ తో పాన్ ఇండియా స్టయికి వెళ్లారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
Also Read : వడ్డే నవీన్ భార్య కి తారక్ కి ఉన్న బంధం ఇదే .
ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి వివాహం ..
ఎన్టీఆర్ సినిమాలతో పాటు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. తారక్ తరచుగా భార్య పిల్లలని తీసుకుని వెకేషన్ కి వెళుతుండటం చూస్తూనే ఉన్నాం. 2011లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి లకు వివాహం జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు పిల్లలు వీరికి సంతానం. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు 2014లో అభయ్ రామ్ మొదటి సంతానంగా జన్మించాడు. మొదటి బిడ్డ పుట్టేటప్పుడు ఎన్టీఆర్ టెన్షన్ అంతా ఇంతా కాదట. ఆ సమయంలో రభస చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది.జీవితంలో మరచిపోలేని ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని తారక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఆ సమయంలో లక్ష్మీ ప్రణతి నిండు గర్భిణి. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా హాస్పిటల్ కి రావాలని వైద్యులు తెలిపారు. నేను రభస మూవీ కోసం స్విట్జర్లాండ్ షూటింగ్ లో ఉన్నాను. ప్రతి రోజు భార్యతో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేవాడట. ఒక రోజు ప్రణతి డల్ గా కనిపించింది.. నేను ఫారెన్ లో ఉన్నా.. నేను వచ్చే లోపు బిడ్డని కనకు.. చంపేస్తాను.. నాకు టెన్షన్ గా ఉంది అని సరదాగా చెప్పాడట. అలాంటిది ఏమి లేదు నేను బాగానే ఉన్నాను అని ఆమె సమాధానం ఇచ్చిందట.ఇకపోతే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి వ్యక్తిగత విషయాల గురించి మనలో చాలామందికి తెలియదు.
హైదరాబాద్ లో మార్చి 18, 1992లో నార్నె శ్రీనివాసరావు, మల్లిక దంపతులకు జన్మించిన ప్రణతి, చిన్నతనం అంతా కూడా హైదరాబాద్ లోనే గడిపారని, అలానే తన కాలేజీ విద్యను అక్కడి నాజర్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారని తెలుస్తోంది. ఆమె తండ్రి నార్నె శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపార వేత్త, పలు రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ కు కూడా ఆయన ఎండి గా వ్యవహరించారు. తన గ్రాడ్యుయేషన్ అనంతరం ప్రణతికి ఎన్టీఆర్ తో వివాహం జరిగింది. ఇక మొదటి నుండి ప్రణతి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. స్వతహాగా మితభాషి అయిన ఆమె ఎక్కువగా మాట్లాడరని, అయితే తన ఫ్రెండ్స్, భర్త మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఎప్పుడూ సరదాగా ఉంటారని ఆమె సన్నిహితుల సమాచారం.
లక్ష్మీ ప్రణతి ది ఐరన్ లెగ్
ఇకపోతే ఎన్టీఆర్ తో పెళ్లి తర్వాత లక్ష్మీ ప్రణతి కొన్ని విమర్శలను ఎదుర్కొంది. నందమూరి ఫ్యామిలీకి యాంటీ ఫ్యాన్స్ అయిన కొందరు ఆమెను టార్గెట్ చేశారు. ఐరన్ లెగ్ అంటూ లక్ష్మీ ప్రణతిని అవమానించారు. ఇందుకు కారణం లేకపోలేదు. మ్యారేజ్ అయ్యాక కెరీర్ పరంగా ఎన్టీఆర్ చాలా స్రగ్గుల్స్ ను ఫేస్ చేశాడు.2011 నుంచి 2014 వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో నలిగిపోయాడు. 2011లో రిలీజ్ అయిన శక్తి మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. అదే ఏడాది వచ్చిన ఊసరవెల్లి కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
అలాగే 2012లో దమ్ము, 2013లో బాద్‌షా, రామయ్యా వస్తావయ్యా, 2014లో రభస చిత్రాలు విడుదలై ఎన్టీఆర్ కు షాకుల మీద షాకులు ఇచ్చాయి. దీంతో కొందరు యాంటీ ఫ్యాన్స్ లక్ష్మీ ప్రణతిని ట్రోల్ చేశారు.ప్రణతి రాకతోనే ఎన్టీఆర్ కెరీర్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయిందని.. ఆమెతో పెళ్లి ఎన్టీఆర్ కు అస్సలు కలిసి రాలేదని విమర్శించారు. ఐరన్ లెగ్ అంటూ లక్ష్మీ ప్రణతిని దారుణంగా అవమానించారు. ఈ కామెంట్స్ లక్ష్మీ ప్రణతి మానసికంగా కృంగదీశాయి. అయితే అటువంటి టైమ్ లో భార్యకు ఎన్టీఆర్ అండంగా నిలబడ్డాడట.
Also Read : అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్ ,
భార్య తెచ్చిన కట్నం
జూనియర్ ఎన్టీఆర్ తన పెళ్లికి ఇంత కట్నం తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడూ చూద్దాం. రాష్ట్రంలోనే ధనవంతుల్లో ఒకరు అయిన నార్నె శ్రీనివాసరావు కూతురే లక్ష్మీ ప్రణతి. అంతేకాకుండా ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి జరగడానికి కారణం చంద్రబాబు అంటూ ఓ ప్రచారం కూడా ఉంది.ఆ ప్రచారం కు తగినట్టుగానే చంద్రబాబు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ల వివాహ సమయంలో పెద్దగా వ్యవహరించారు. ఇక నార్నే శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాగా ఆయనకు హైదరాబాద్ శివారులో కొన్ని ఎకరాల భూములు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా అప్పట్లో ఎన్టీఆర్ కు ఇచ్చిన భూముల విలువ రూ. 250 కోట్ల వరకు ఉంటుందని కూడా టాక్. మరోవైపు లక్ష్మీ ప్రణతికి తల్లిదండ్రులు మొత్తం రూ.1200 కోట్ల వరకు కట్న కానుకలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతితో కాస్త రొమాంటిక్‌గా ఉంటాడని, వాళ్ళిద్దరి మధ్య పిలుపులు కూడా అంతే అందంగా ఉంటాయనే విషయం ముచ్చటేస్తుంది. ఇక సైలెంట్‌గా కనిపించే ప్రణతి ఎన్టీఆర్‌తో జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటుందట. ఇక ఎన్టీఆర్‌కి బావా అని పిలిపించుకోవడం ఇష్టంగా ఉండటంతో ప్రణతి, ఎన్టీఆర్‌ని బావా అనే పిలుస్తుందట.ఇలా పిలవాలనే విషయాన్ని ప్రణతి నిశ్చితార్థం రోజునే ఫిక్స్ అయిందట. బావా అని పిలవగానే ఎన్టీఆర్ కోపంగా ఉన్నా సరే వెంటనే మూడ్ మారిపోయి నార్మల్ అయిపోతాడని తెలుస్తుంది. ఏది ఏమైనా అన్యోన్య దాంపత్యానికి ఇలాంటి సరదాలు, సరసాలు కూడా అవసరమే.. వీళ్ళ బంధం మరింత పచ్చగా ఉండాలని కోరుకుందాం.
త్వరలో సొంత బిజినెస్
నిజానికి ఇప్పటివరకు ప్రణతి కనీసం నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అటువంటి లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ ఒక విషయంలో రోజు గడపడేవాడట. గొడవ అంతే అదేదో పెద్ద గొడవ కాదులెండి.ఏసీ టెంపరేచర్ ఎంతలో ఉండాలి అనే ఓ సరదా విషయంపై ఇద్దరు తరుచూ గొడవపడేవారట. అయితే.. ఎన్టీఆర్ కోసం లక్ష్మీ ప్రణతి కాంప్రమైజ్ అయ్యేదట. అంతే కానీ ప్రణతి కోసం ఎన్టీఆర్ మాత్రం పొరపాటున కూడా కాంప్రమైజ్ అవ్వలేదట. ఈ విషయాన్ని కపిల్ శర్మ షోలో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అదే ప్రశ్నను సినిమాలో నటించిన సైఫ్ (ను అడగగా.. నేను కరీనా కలిసి ఓ ఒప్పందానికి వచ్చాము అని సమాధానం ఇచ్చాడు.అలాగే ఇకపోతే.. లక్ష్మి ప్రణతి త్వరలోనే సొంతగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల భార్యలు ఏదో ఒక విధమైన పోష్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఈమధ్యకాలంలో కామన్ అయిపోయింది. మరి ప్రణతి ఏ తరహా బిజినెస్ స్టార్ట్ చేస్తుందో చూడాలి.
మరో తారక రాముడు ..
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా వైవీఎస్ తారక రామారావు ఫస్ట్‌లుక్ రిలీల్ చేశారు. పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ లో దర్శనం ఇచ్చాడు నందమూరి నాలుగో తరం నటవారసుడు. ఈ క్రమంలో ఆయన ఆల్‌ది బెస్ట్ చెబుతూ బాబాయ్‌లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో పాటు పలువురు ట్వీట్స్ చేశారు.‘రామ్‌కు ఆల్‌ది బెస్ట్.. ఇది నీ మొదటి అడుగు. సినీ ప్రపంచం మీకు లెక్కలేనన్ని ఆనందక్షణాలను అందజేస్తుంది. మీకు అన్ని విజయాలే దక్కాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. ‘అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.