Gangavva  | ఐదేళ్ల వయసులోనే పెళ్లి.. ఇప్పుడు 2 కోట్ల ఆస్తి …

Written by admin

Published on:

Gangavva  | నిజంగా ఎక్కడో కరీంనగర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సుపరిచితురాలిగా మారింది.గంగవ్వ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొత్తగా ఏదైనా సాధించే వయసు కాదు ఆమెది. కానీ ఏదైనా సాధించటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన ధీర ఆమె. జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడింది.ఇక ఆమెను ఏ కష్టం ఏమీ చేయలేదనే స్థాయికి వచ్చింది. 60 ఏళ్ల జీవితంలో ఎన్నో కోల్పోయింది. కానీ..ఏనాడు కుంగిపోలేదు. పోరాడటం ఆపలేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని.. తన మెతుకు తానే సంపాదించుకొని కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిగా నిలిచింది.

ఐదేళ్ల వయస్సుకే పెళ్లి

నిజానికి గంగవ్వ ఒకటో తరగతి చదివింది.కానీ కష్టాలు అనుభవించటంతో వాటిని అధిగమించటంతో ఆమె పీహెచ్ డీలే చేసింది. తెలిసీ తెలియని.. ఐదేళ్ల వయసులోనే గంగవ్వకు పెళ్లి జరిగింది. పెళ్లి అంటే ఏంటో తెలియని వయస్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. కొన్నేళ్ల పాటు గల్ఫ్‌కు వెళ్లిన భర్త.. 13 ఏళ్ల క్రితం చనిపోయాడు. తర్వాత వ్యవసాయ కూలీగా పనిచేస్తూ.. పిల్లల పోషణ భారాన్ని మోసింది. వారిని పెంచి.. పెద్ద చేసి.. తన రెక్కల కష్టంతోనే అందరి పెళ్లిళ్లు చేసింది.ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

Gangavva  |

60 ఏళ్ళ వయసులో బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది గంగవ్వ. నటనపై ఏమాత్రం అనుభవం లేకున్నా.. ఆమె మాట్లాడే యాస అందరికీ బాగా నచ్చుతుంది. తెలంగాణ కట్టు, బొట్టుతో గంగవ్వ బుల్లితెరపై పండించే కామెడీ మామూలుగా ఉండదు. అందుకే ఆమె పాపులారిటీ మెచ్చి తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా తీసుకున్నారు. బిగ్‌బాస్‌ తర్వాత గంగవ్వ జీవితం పూర్తిగా మారిపోయింది.గంగవ్వకు అంతకుముందు నటన అంటే ఏంటో కూడా తెలియదు. ఏ యాక్టింగ్ స్కూల్‌లోనూ ట్రైనింగ్ తీసుకోలేదు.కానీ.. ఆవిడ చేసేదంతా నేచురల్ యాక్టింగ్. చదువు లేకపోయినా..చెప్పింది విని డైలాగ్‌లు విని.. గుర్తుపెట్టుకొని మరీ.. పొల్లు పోకుండా చెప్పేస్తుంది.

తొలిసారి తెరంగేట్రం

ఆవిడ నటనలో సహజత్వం కనిపిస్తుంది. అలా.. యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారాక.. గంగవ్వ సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. 2019లో గంగవ్వ తొలిసారి మల్లేశం సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. తర్వాత చాలా చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.అంతకు ముందు చిన్న పెంకుటిల్లులో ఉన్న గంగవ్వ ఇప్పుడు పెద్ద బంగ్లా నిర్మించుకుంది.బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన గంగవ్వ తనకు ఉన్న స్థలంలో రూ. 22 లక్షలతో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిపింది. ఇక ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేసినట్లు పేర్కొంది. అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది.

షెడ్డు నిర్మాణానికి రూ. 3 లక్షల ఖర్చయినట్లు తెలిపింది.ఇంకా రూ. 9 లక్షలతో నాలుగున్నర గుంటల పొలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే మరో చోట తన పేరు మీద రెండున్నర ఎకరాలు ఉన్నట్లు తెలిపింది. దీని విలువ సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుందంటా. అలాగే వీటితో పాటు రూ. 3 లక్షల విలువైన మరో ప్లాట్‌ కూడా ఉందని గంగవ్వ చెప్పుకొచ్చింది. అలాగే రూ. 8 లక్షల విలువైన మరో 15 గంటల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు తెలిపింది. ఇలా మొత్తం మీద అన్ని కలుపుకుంటే గంగవ్వ ఆస్తుల విలువ ఎంత కాదన్న రూ. కోటిన్నర వరకు ఉండొచ్చన్నమాట.

Also Read : అక్కినేని అఖిల్ కి 2000 కోట్ల కట్నం.. ఏంది సామి ఇది …

తాజాగా కొత్త ఇంట్లో గంగవ్వ గృహప్రవేశం చేయగా.. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ సీజన్ కంటెస్టెంట్లు కూడా హాజరయ్యారు.బిగ్ బాస్ కంటెస్టెంట్లు అఖిల్‌, శివజ్యోతితో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా ఈ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్‌ షో టీం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో యూట్యూబ్లో కాసేపటికే ట్రెం‍డింగ్‌లో నిలిచిందంటే గంగవ్వ క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.

Gangavva 

మై విలేజ్ షో రాజు పై కేసు

తాజాగా గంగవ్వ, యూట్యూబర్ రాజు పై కేసు నమోదైంది. వణ్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ను నిబంధన ఉల్లంఘించారంటూ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం భారత చిలుకను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 20, 2022 లో ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియోలో మల్యాల మండలం లంబాడీపల్లిలో గంగవ్వ,

రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారని గౌతమ్ తెలిపారు. ఇది భారతీయ చిలుకలు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద వర్గీకరించబడింది. ఈ చట్టం చిలుకల అపహరణ, హింసల నుంచి కాపాడుతుంది. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన అటవీ రేంజ్ అధికారి (FRO) పి పద్మారావు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ వీధిలో ఉండే జ్యోతిష్యుడి దగ్గర నుంచి రాజు ఈ చిలుకను తెచ్చినట్టు వెల్లడైంది.

గంగవ్వకి గుండెపోటా..

గంగవ్వను నామినేట్ చేస్తే తాము ప్రేక్షకుల్లో నెగిటివ్ అవుతామని భావించేవారు. హౌజ్‌లో ఉండే ఎయిర్ కండిషనింగ్ కారణంగా , వేళాపాళా లేకుండా నిద్రలేపి టాస్క్స్ ఆడించడం వలన గంగవ్వ అనారోగ్యానికి గురైంది. దాంతో బయటకు వచ్చేసింది. అయితే తిరిగి సీజన్ 8లో గంగవ్వని బిగ్ బాస్ షోకి తీసుకొచ్చారు. మొన్నటి వరకు చాలా యాక్టివ్‌గా కనిపించిన గంగవ్వకి గుండెపోటు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.గత రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కంటెస్టెంట్స్ అందరూ హడలెత్తిపోయారట..ముఖ్యంగా విష్ణు ప్రియకు చెమటలు కూడా పట్టాయనిటాక్. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే .. మరి కొంతమంది ఇది ఫ్రాంక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకే గంగవ్వకి గుండెపోటు వచ్చినట్లు నటించిందని ,తోటి కంటెస్టెంట్ లను ఆమె నమ్మించాలి అనేది ఆమెకు ఇచ్చిన టాస్క్ అని, అందులో గంగమ్మ సక్సెస్ అయిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Also Read : కీర్తి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అడిగింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

దాహం తీర్చేందుకు గంగవ్వ

గంగవ్వ తాజాగా చేసిన ఓ వ్లాగ్ వైరల్ గా మారింది. తన ఊరి ప్రజల కోసం కార్పోరేటర్ ని అడిగి మరీ ఫిల్టర్ నీళ్ళు తెప్పించి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంది గంగవ్వ. అయితే తను చేసిన ఈ మంచిపనిని కొందరు దుర్వినియోగం చేశారు. వాళ్ళ ఊరి సర్పంచ్ గా గంగవ్వ పోటీచేసి గెలవాలని చూస్తుందని ఒకతను భావిస్తాడు. అతను తన స్నేహితుడితో కలిసి గంగవ్వ చలివేంద్రంలో లేని సమయంలో వస్తారు.అక్కడ కుండలలో ఉన్న నీళ్ళతో బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం లాంటివి చేసి నీళ్ళని వృధా చేశారు. ఇక అన్ని చలివేంద్రాలు చూసుకుంటు గంగవ్వ అక్కడికి వస్తుంది. ఇక నీళ్ళని వృధా చేసిన వారిద్దరిని తిట్టేస్తుంది. ఇక ఆ ఊరి కార్పోరేటర్ వచ్చి.. గంగవ్వ పెద్ద మనసు చేసుకొని దప్పికతో ఊరిలోకి వచ్చేవాళ్ళ కోసం ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసిందని, మంచి చేయకపోయిన పర్లేదు కానీ ఇలా దుర్వినియోగం చేయకూడదని వార్నింగ్ ఇస్తాడు.

ఈ మద్య కేటీఆర్ మై విలేజ్ షోకు వెళ్లారు. అక్కడ గంగవ్వతో పాటు అనిల్ జీలా, అంజి మామతో కలిసి స్వయంగా నాటుకోడి కూర, గుడాలు, బాగార అన్నం వండారు కేటీఆర్. ఇందుకు సంబంధించిన సుమారు 42 నిమిషాల పాటు ఉన్న వీడియోను కల్లివెళ్లి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే.. అందులో కేటీఆర్‌తో గంగవ్వ ముచ్చట్లు నవ్వులు పూయించాయి. ఏమనుకోవద్దు అనుకుంటూనే.. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగింది గంగవ్వ. కేసీఆర్‌తో తనకు ఎప్పుడైన గొడవలు అయ్యాయా అని అడగ్గా…

అమెరికాలో ఉన్నప్పుడు

గొడవలు జరగని ఇళ్లు ఉండదని.. వాళ్లకు కూడా జరిగాయని చెప్పారు కేటీఆర్. కేసీఆర్‌ను ఏమని పిలుస్తావ్ అని అడగ్గా.. బయట సార్ అని, ఇంట్లో మాత్రం డాడీ అని పిలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. వాళ్ల టీంతో పాటు కేటీఆర్ టమాటలు కోశారు. ముచ్చట్లు చెప్తూనే అందరి కంటే ముందే కోసేశారు. అమెరికాలో ఉన్నప్పుడు తానే అన్ని పనులు చేసుకున్నానని.. చెప్పారు. ఏ కూర బాగా వండుతారని అంజిమామ అడిగితే.. తాను అన్ని బాగానే వండుతా కానీ.. అది తినే వాళ్ల మీద ఆధారపడి ఉంటుందంటూ నవ్వులు పూయించారు.

అటు వంట చేస్తూ.. మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూనే.. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు కేటీఆర్. మొత్తానికి నాటు కోడి కూరతో బాగారా అన్నంతో గంగవ్వ టీంతో కలిసి సరదా సరదాగా ముచ్చట్లు చెప్పుకుటూ కేటీఆర్ జబర్ధస్త్ దావత్ చేసుకున్నారు.చివరిగా గంగవ్వలో ఎంతో టాలెంట్ ఉంది. కానీ.. అది బయటపడటానికి చాలా సమయం పట్టింది. 60 ఏళ్లు దాటాక ఆమెకు ఊహించని సక్సెస్ వచ్చింది. కానీ.. అప్పటిదాకా గంగవ్వ ఓర్పుగా వెయిట్ చేసింది. కష్టాలు వచ్చాయని కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. ఆత్మస్థైర్యంతో మరింత ముందుకు వెళ్తోంది. నేటి తరం మహిళలకు.. ఆదర్శంగా నిలుస్తోందీ ధీర.

ఆరోగ్య సమస్య ..

గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. . ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయంటూ గత శనివారం ఎపిసోడ్ లో నాగార్జునతో కూడా చెప్పుకుని బాధపడ్డారామె. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్త్ఉంటే గంగవ్వ తనంతట తాను హౌస్ నుంచి వెళ్తే తప్ప ఆడియన్స్ ఆమెను ఎలిమినేట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈక్రమంలోనే అనారోగ్యం దృష్ట్యా గంగవ్వ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం.

🔴Related Post

Leave a Comment