Actress Annapurna | అప్పట్లో నాకు ఆరుగురు భర్తలు .. నటి అన్నపూర్ణ

Written by admin

Published on:

Actress Annapurna |టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర సీమలో తన నటనతో ఎంతో మంది చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక కామెడీలోనూ తన దైన ముద్రను వేశారు. నాటి తరం నుంచి నేటి వరకు ఎంతో మంది హీరోలకు అమ్మగా, బామ్మగా నటించి మెప్పించారు. అమ్మ పాత్రలు వేయకముందే బామ్మ పాత్రలు కూడా వేశానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. 75 ఏళ్ళ వయసులో కూడా ఇంకా యాక్టివ్ గా సినిమాలు చేస్తూ, షోలలో కనిపిస్తూ ఫుల్ బిజీగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది అన్నపూర్ణమ్మ. అయితే తాజాగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయటకు చెప్పేశారు.

Actress Annapurna

మొదటగా హీరోయిన్‌..

అయితే ఆమె మొదటగా హీరోయిన్‌గా నటించిన విషయం చాలా తక్కువమందికి తెలుసు. 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన నటించింది. ఇదే ఆమెకు తొలిచిత్రం. మోహన్ బాబుకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో ఆమె పేరు కూడా అన్నపూర్ణే కావడం మరో విశేషం. మొదటి చిత్రంతోనే ఉమా మహేశ్వరి అన్నపూర్ణగా, భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మార్చేశారు దాసరి.

ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే మోహన్ బాబు చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటారని అన్నపూర్ణ భావించారట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక మోహన్ బాబుకు హీరోయిన్‌గానే కాకుండా తల్లిగా కూడా నటించి మెప్పించారు అన్నపూర్ణ. అసెంబ్లీ రౌడి తదితర చిత్రాల్లో మోహన్ బాబుకి తల్లిగా నటించారు అన్నపూర్ణ. ఈ సినిమా ద్వారా మోహన్ బాబు, అన్నపూర్ణలతో పాటుగా ఈశ్వరీరావు, జయలక్ష్మీలు సినీ రంగ ప్రవేశం చేశారు.

Also Read : ఈ ఒక్క షో కోసమే 5000 చీరలు కట్టాను .. యాంకర్ సుమ

సొంత పెళ్లాంలా ఫీల్

అలీతో సరదాగా కార్యక్రమంలో సీనియర్ నటి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ తనకు ఆరుగురు భర్తలని చెప్పి టక్కున నవ్వేశారు. మొదట్లో హీరోయిన్‌గా నటించాలంటే కొన్ని ఇబ్బందులు వచ్చాయని.. కొందరు నాకేంటి అని అడిగే వాళ్లని అందుకే హీరోయిన్ వేషాలు మానేసి చిన్న వయసులోనే అమ్మగా సెటిల్ అయిపోయానని అన్నపూర్ణ చెప్పారు. ఆ తర్వాత తనకు ఆరుగురు భర్తలున్నారని నవ్వుతూ చెప్పారు.

ఆ రోజుల్లో తనకు ఆరుగురు సినిమా భర్తలు ఉండేవాళ్లని.. అందులో ఎక్కువగా గుమ్మడి గారితో నటించేదాన్ని అంటూ తెలిపారు అన్నపూర్ణ. ఈ మాట వినగానే పక్కనే ఉన్న వై విజయతో పాటు అలీ కూడా పక్కున నవ్వేశాడు. ఆ రోజుల్లో అలా ఎక్కువ సినిమాల్లో నటించడం వల్లో ఏమో కానీ గుమ్మడి గారూ తల పట్టుకుంటూ.. ఏంటో ఇది అంటూ తనను నిజంగానే సొంత పెళ్లాంలా ఫీల్ అయ్యేవారంటూ నవ్వేశారు అన్నపూర్ణ.

Actress Annapurna

రూ.2500 రెమ్యునరేషన్‌..

నిజానికి రెమ్యునరేషన్‌ విషయంలో నేను అసలు మొహమాట పడను. అలా అని ఎక్కువ డిమాండ్‌ చేయను. అందుకే, నాకు ఇవ్వాల్సినంత ఇచ్చేవాళ్లు. మొదట్లో నా రెమ్యునరేషన్‌ రూ.2500. రూ.5000 ఇస్తే బాగుండు అనిపించేది. కానీ, గుమ్మడి గారు, జగ్గయ్యగారు లాంటి వాళ్ల పక్కన నటించడం కదా.. అందుకే ఎక్కువ అడిగేదాన్ని కాదు. లెజెండ్స్‌ పక్కన నటిస్తే కచ్చితంగా పేరు వస్తుందనే ఆశ ఉండేది అప్పట్లో. ఇక అప్పట్లో కొత్తగా వాళ్లతో చేస్తే రూ.1500 ఇచ్చేవాళ్లు.

“ఇంతే ఇవ్వగలం ఉమా” అనేవాళ్లు. ఇక నాకు అన్నపూర్ణ అని పేరు పెట్టింది సి.నారాయణ గారు. ‘స్వర్గంనరకం’ చేసినప్పుడు ఆ పేరు పెట్టారు. నేను హీరోయిన్‌గా పనికిరానేమో అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. అప్పట్లో హీరోయిన్‌ అంటే మెయింటెయిన్‌ చేయాలి. దానిబదులు ఇలా క్యారెక్టర్లు వేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను” అని రెమ్యునరేషన్‌ గురించి చెప్పారు అన్నపూర్ణమ్మ.

అన్నపూర్ణమ్మ భర్త..

ఇక భార్యాభర్తల్లో ఒకరు ఆర్టిస్ట్‌ అయితే వారి సంసార జీవితంలో కూడా ఆనందం కరువవుతుంది. ఆ విషయం గురించి సీనియర్‌ నటి అన్నపూర్ణ ప్రస్తావిస్తూ.. తన జీవితంలో జరిగిన సంఘటనను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘నేను నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒక వ్యక్తి నన్ను స్టేజ్‌ మీద చూసి ఇష్టపడ్డారు. అతన్నే పెళ్లి చేసుకున్నాను. నేను నటిగా బిజీగా ఉండేదాన్ని, అతను తన ఉద్యోగం వల్ల చాలా ఊర్లు తిరగాల్సి వచ్చేది. ఒక దశలో సినిమాలు మానెయ్యమన్నారు.

ఇంటి పట్టున ఉంటే బాగుంటుంది అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. తను ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలనేది ఆయన కోరిక. వైవాహిక జీవితంలో అలా ఆలోచించడం తప్పుకాదు.అయితే అది నా వల్ల కాలేదు. ఎందుకంటే, ఉదయం 7 గంటలకు షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలి. మద్రాస్‌లో విపరీతమైన వేడి ఉంటుంది. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దయిపోతాం. ఇక శృం*ర పరమైన ఆలోచన చేసే టైమేది? ఓపిక ఎక్కడుంటుంది? అందుకే మా ఆయనకు ఓ సలహా ఇచ్చాను.

నేనెంత దుర్మార్గురాలిని అంటే.. మీకు అనుకూలంగా ఉంటూ ఇంటిపట్టున ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాను. ఆమెతో కాపురం చేసుకోమని మొహమాటం లేకుండా చెప్పాను. కానీ, ఆయన చాలా మంచివారు. నేను ఇచ్చిన ఆఫర్‌ని తీసుకోలేదు. నేను మాత్రం సినిమా రంగాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు’ అంటూ తన జీవితంలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలిపారు అన్నపూర్ణ.

అయితే అన్నపూర్ణ ఓ అమ్మాయిని దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. అనంతరం ఆ అమ్మాయి కీర్తికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి కూడా చేశారు. అయితే ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత కీర్తి హఠాత్తుగా ఆ* చేసుకుంది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా కూడా మారింది.ఇటీవల ఓ సందర్భంలో అన్నపూర్ణ తన కూతురు కీర్తిని గుర్తు చేసుకున్నారు. కీర్తి ఆత్య ఆమె అత్తారిల్లు గురించి స్పందించారు. తన కూతురు మరణం తనకు తీరని దుఃఖం కలిగించిందని అన్నారు. అయితే తన కూతురు ఎప్పుడూ అత్తవారింట్లో తనను కష్టపెడుతున్నారని చెప్పలేదు..

Also Read : అలాంటి ఆఫర్స్ నాకు ఎప్పుడు వద్దు.. ప్రియమణి

Actress Annapurna

అసలు కీర్తి ఇంట్లో ఏమి జరిగిందో నాకు తెలియదు అన్నారు. కీర్తి అత్తవారు చాలా మంచి వాళ్ళు.. అయితే కీర్తి ఎందుకు ఆ**త్య చేసుకుందో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని అన్నారు. అయితే తన కూతరుకి కాస్త కోపం ఎక్కువ అని .. సమస్య ఏమిటో చెప్పకుండా దూరతీరాలకు వెళ్లిపోయిందని ఏదైనా చిన్న మాటకు హార్ట్ అయి..

క్షణికావేశంలో కీర్తి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అన్నపూర్ణ చెప్పారు. తన మనవరాలిని కొన్ని నెలలు పెంచాను. తర్వాత వాళ్ళ నాన్నదగ్గరకు వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం ఐదేళ్లు నా మనవరాలికి అంటూ అన్నపూర్ణమ్మ గతాన్ని .. కూతురు క్షణికావేశంలో చేసిన గాయం తాలూకూ బాధను పంచుకున్నారు.

అందుకే ఇంతకాలం

నిజానికి అవకాశాల కోసం నేను ఎప్పుడూ ఎవరినీ అడగలేదు. అలాగే పారితోషికం విషయంలో కూడా నేను డిమాండ్ చేసింది లేదు. అలా చూస్తుండగానే నటిగా 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాను. 1972 – 73లలో నేను సినిమాలలోకి వచ్చాను .. 80లలో బిజీ అయ్యాను. మొదట్లో హీరోయిన్ గా వేషాలు వచ్చాయి గానీ, అంత బాగుండనని నాకు అనిపించడం వలన ఆ దిశగా ముందుకు వెళ్లలేదు” అన్నారు.

” ఇప్పుడంటే రోజుకి ఇంత అని పారితోషికాన్ని ఇస్తున్నారు. అప్పట్లో ప్రాజెక్టు మొత్తానికి కలిపి ఇచ్చేవారు. అలా 10వేల పైన ఇస్తే గొప్ప విషయం. ఏదైనా సరే మన దగ్గరికి పరిగెత్తుకు వస్తే దాని విలువ తెలియదు. మనం దాని దగ్గరకి నడచుకుంటూ వెళ్లినప్పుడే విలువ తెలుస్తుంది. అలా విలువలు తెలుసుకుంటూ వెళ్లడం వల్లనే ఇంతకాలం నిలబడ్డాను” అని చెప్పారు.

ఏది ఒకరి వైపు ఉండదు ..

సినీ పరిశ్రమలో క్యా*గ్ కౌచ్ అనేది ఒకరి వైపు ఉండదని కుండ బద్దలు కొట్టారు అన్నపూర్ణమ్మ. ఇద్దరికి ఇష్టమైతేనే కొన్ని సార్లు అలా తప్పులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇక నట ప్రస్థానం నాటకాల నుంచి ఆరంభం అయిందని పేర్కొన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఉమగా ఉన్న తన పేరును అన్నపూర్ణగా మార్చుకున్నాను. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను పనిచేసిన ప్రతి ఒక్క హీరో తనను ఎంతో గౌరవించారు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు వాళ్లంత తనతో మర్యాద పూర్వకంగా ఉండేవారన్నారు.ఇక క్యాగ్ కౌచ్ గురించి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. ఇదో అనవసరపు వ్యవహారం అని పేర్కొన్నారు. కేవలం సినీ రంగంలోనే కాదు. ప్రతి రంగంలో మహిళలు ఇలాంటి క్యాగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కానీ ఇళ్లు, ఫ్యామిలీ, గౌరవం అనే వాటిని దృష్టిలో పెట్టుకొని వేటికి లొంగకుండా మహిళలు ఎంతో నేర్పుగా తప్పించుకుని ఇంటికి వస్తున్నారు. అదే మాదిరి సినిమా వాళ్లు కూడా తప్పించుకుని తిరగాలన్నారు.

Also Read : ఐదేళ్ల వయసులోనే పెళ్లి.. ఇప్పుడు 2 కోట్ల ఆస్తి …

చెట్టుకి కట్టేసి మరీ ..

అన్నపూర్ణ గారిని తన కన్న తల్లి ఎదుటే చెట్టుకి కట్టేసి మరీ కొట్టారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పుకొచ్చింది. అన్నపూర్ణ మాట్లాడుతూ.. “నా చిన్నతనంలో హిందీ నేర్చుకోవడానికి ట్యూషన్ కు వెళ్లేదాన్ని. అక్కడ ఓ మాష్టారు ఉండేవారు. ఆ ఇంటి పక్కన ఉన్న ఓ అమ్మాయికి ఇవ్వమని నాకో ఉత్తరం ఇచ్చారు. అలా కొన్ని రోజుల పాటు నేను అతని దగ్గరనుండీ ఉత్తరాలు తీసుకోవడం.. ఆమెకు ఇవ్వడం జరిగేది.ఓ సారి ఈ తంతు వాళ్ళ ఇంట్లో తెలిసింది.

ఓసారి ఉత్తరం ఆ పక్కింటి అమ్మాయికి ఇస్తుండగా.. ఆమె ఇంట్లో వాళ్ళు దాన్ని లాక్కుని చదివారు. అందులో ఆ మాష్టారు, ఆ పక్కింటి అమ్మాయి పారిపోయి పెళ్లికోవాలని డిసైడ్ అయినట్టు రాసి ఉందట. దాంతో నన్ను చెట్టుకి కట్టేశారు. మా అమ్మకి ఈ విషయం చెబితే..’ఏం పర్లేదు కొట్టండి అలా కొడితే గాని ఇలాంటి ఎదవ వేషాలు వేయకుండా ఉండదు’ అంటూ మండిపడింది. ఆ సంఘటనతో నాకు జ్ఞానోదయం అయ్యింది.ఒకరి విషయాలు ఇంకొకరికి చేరవేయకూడదు అని.

🔴Related Post

Leave a Comment