Actor Surya | సూర్య ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Written by admin

Published on:

Actor Surya | నేటితరం హీరోల్లో సూర్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య.. 1997లో ‘నెరుక్కు నేర్’ అనే తమిళ సినిమాతో అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. కేవలం తమిళ నాట మాత్రమే కాదు.. తెలుగులోనూ స్టార్ హీరోగా కీర్తించబడుతున్న ఘనత సూర్య సొంతం. మొదటి నుంచి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న ఆయన, డబ్బింగ్ కా బాప్ అనిపించుకుంటూ హవా నడిపిస్తున్నారు.”గజినీ, సింగం” లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు హీరో సూర్య.

Actor Surya

అప్పు చేసి చిన్న బిజినెస్..

ఈ మధ్యే ఆకాశమే నీహద్దురా, జై భీమ్ సినిమాలు కూడా సూర్యకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలపై దృష్టి పెట్టిన్ హీరో సూర్య . తండ్రి శివ‌కుమార్ న‌టుడే అయిన‌ప్ప‌టికీ సూర్య మాత్రం ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని అస్స‌లు అనుకోలేదు. అందులో భాగంగానే.. సినిమాల్లోకి రాక‌ముందు ఎనిమిది నెలల పాటు గార్మెంట్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో సూర్య జాబ్ చేశాడు. రోజుకు 18 గంట‌లు ప‌ని.. నెల‌కు రూ. 700 జీతం. అయితే ఆ సేల‌రీ స‌రిపోక‌పోవ‌డంతో సూర్య అప్పు చేసి మ‌రీ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. వ్యాపారం లాభ‌సాటిగా ఉన్నా కూడా ఆ రంగంపై సూర్య ఆస‌క్తి చూప‌లేక‌పోయాడు.దాంతో వ్యాపారం దెబ్బ‌తిని అప్పుల్లోకి వెళ్లాడు.

అటువంటి స‌మ‌యంలో అప్పులు తీర్చేందుకు న‌టుడు కావాల‌ని సూర్య నిర్ణ‌యించుకుని ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నెర్ మూవీతో 22 సంవత్సరాల వయస్సులో త‌న న‌ట‌నా వృత్తిని ప్రారంభించాడు. ఈ మూవీ స‌మ‌యంలోనే శరవణన్ గా ఉన్న‌ పేరును మ‌ణిర‌త్నం గారు సూర్య‌గా మార్చారు. ఇక న‌ట‌నే ఇష్టంలేని సూర్య ఆ విధంగా సిపీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి స్టార్‌గా ఎదిగాడు. యువ న‌టుల‌కు ఆద‌ర్శింగా నిలిచాడు.

Also Read : నట ప్రస్తావనకు 56 ఏళ్ళు.. ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా ,

భాషకు గౌరవం ఇవ్వాలి..

అలాగే తెలుగులో ఒకప్పుడు కె.విశ్వనాథ్ గారి సినిమాలు చాలా బాగుండేవి. చూస్తున్న ప్రేక్షకుడికి ప్రశాంతత ఇచ్చేవి. ఈమధ్యకాలంలో వయొలెన్స్ ఎక్కువైపోయింది. సెన్సార్ వాళ్లు కూడా వరుసబెట్టి అవే సినిమాలు చూసి బోర్ అయిపోయారు. అలాంటి సమయంలో విశ్వనాథ్ గారి సినిమాలాంటి ఫీల్ ఇచ్చే చిత్రమే “సత్యం సుందరం”.ఈమధ్యకాలంలో తమిళ సినిమాలను తమిళ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కార్తీ.. “భాషకు గౌరవం ఇవ్వాలి, అందుకే మా సినిమాకు “సత్యం సుందరం” అనే మంచి టైటిల్ ను ఫిక్స్ చేశాం. తప్పకుండా అందరూ కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది” అంటూ ముగించారు.

మెగాస్టార్ తో బంధం ..

నాకు నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.కానీ చిరంజీవి ( Chiranjeevi ) గారు మాత్రం స్వయంగా ఫోన్ చేస్తే తనకు శుభాకాంక్షలు చెప్పారు.అంతేకాకుండా ఒకసారి తనని కలవమని తన ఇంటికి ఆహ్వానించారు.చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా ఫిష్ కర్రీ దోశ చేసి పెట్టారని సూర్య తెలిపారు.ఇక నేను చెన్నైలో ఇల్లు కట్టుకోవడం ఎన్జీవో సంస్థలను ఏర్పాటు చేయడం వంటివి అన్నీ కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని చేశానని తెలిపారు.

చిరంజీవి గారి స్ఫూర్తితోనే నేను ఎన్జీవో సమస్థ ద్వారా సుమారు 6000 మంది విద్యార్థులు చదువుకు సహాయం చేయగలిగానని సూర్య తెలిపారు.ఇక టాలీవుడ్ హీరోల గురించి కూడా ఈయన మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.ప్రభాస్ గురించి మాట్లాడుతూ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అంటూ తెలిపారు.చరణ్ 15 సినిమాలకే గ్లోబల్ స్టార్ ఇమేజెస్ సొంతం చేసుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ రియల్ జీవితంలోను రియల్,రీల్ జీవితంలో కూడా ఒకేలా ఉంటారని తెలిపారు.మహేష్ స్క్రీన్ పై యాటిట్యూడ్ నాకు నచ్చుతుందని తెలిపారు.

Actor Surya

చాలా బోరింగ్

సూర్య‌-జ్యోతిక‌లు ప్రేమించి వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ దంప‌తుల‌కు దియా-దేవ్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వృత్తి-వ్య‌క్తిగ‌త జీవితంలో ఇద్ద‌రు ఎంతో సంతోషంగా ముందుకు సాగిపోతున్నారు. ఇటీవ‌లే చెన్నై నుంచి ముంబైకి షిప్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు.నిజానికి సూర్య‌తో జ్యోతిక ల‌వ్ స్టోరీ చాలా బోరింగ్ అనేసింది. అవును ఈ విష‌యం స్వ‌యంగా జ్యోతిక రివీల్ చేసింది. త‌మ జీవితాల్లో అత్యంత బోరింగ్ విష‌యాల్లో ల‌వ్ కూడా ఒక‌టి అని అన్నారు.

సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక వివరించింది.` సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి అతడు నాకు ఇచ్చిన గౌరవమే ప్రధాన కారణం. మేము తొలిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో కలిసి నటించాం. నాతో చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత ఏడు సినిమాల్లో కలిసి నటించాం. ఎవరైనా డైరెక్టర్ ఓ రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు సూర్య అంత వరకే నటించేవాడు. దానిని అదునుగా తీసుకునేవాడు కాదు. ఆ గౌరవమే నన్ను ఆకర్షించింది.

ఇక నేను అప్పటికే 10 ఏళ్ల పాటు షూటింగ్ లలో 9 నుంచి 6 వరకూ పని చేసీ చేసీ అలసిపోయాను. నాకు అవసరమైనంత డబ్బు అప్పటికే సంపాదించేశాను. ఆ సమయంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. నా కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆ తర్వాతి నెలలోనే పెళ్లి చేసుకున్నాం. ప్రేమ ప‌క్షుల్లా ఎక్కువ కాలం ఎదురు చూడలేదు. బ‌య‌ట పెద్ద‌గా క‌లిసింది..తిరిగ‌తింది కూడా లేదు. అందుకే మా ల‌వ్ స్టోరీ మాకే బోరింగ్ గా అనిపిస్తుంది` అని అన్నారు.

రెండు సార్లు పెళ్లి

ఇదిలా ఉండగా.. సూర్య-జ్యోతిక ల జంట ఒక్కసారి కాదు రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారట. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. సూర్య-జ్యోతిక లు ప్రేమలో ఉన్నప్పుడు…వీరిద్దరి పెళ్ళికి సూర్య సూర్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.ముఖ్యంగా శివ కుమార్ కు సూర్యకి సినిమాల్లో నటించే అమ్మాయితో పెళ్ళి చేయకూడదు అని ముందుగా అనుకున్నాడు. అంతేకాకుండా వీరి మతాలు కూడా వేరు.దాంతో మొదట వీరు రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు.కొన్నాళ్ళ తర్వాత సూర్య తండ్రి రాజీపడి వీరిద్దరికీ మళ్ళీ కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్ళి చేసాడు.అలా సూర్య- జ్యోతిక లు రెండు సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.

Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగచైతన్య తల్లి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

భర్తతో విడాకులు ..

సూర్య, జ్యోతికలు విడాకులు తీసుకోనున్న‌ట్లు గత కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ వార్త‌ల‌పై జ్యోతిక మొదటిసారిగా స్పందించారు.నాకు సూర్యకు మధ్య ఎలాంటి గొడవులు లేవు. పిల్లల చదువుతోపాటు తను బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవ్వడం.. నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగొలేకపోవడం వంటికారణాలతో తాను ముంబైకు షిఫ్ట్ అయినట్లు చెప్పుకొచ్చారు జ్యోతిక. సూర్య చాలా మంచి వ్యక్తి అని.. మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన లేదని చెప్పింది. పిల్లల చదువులు పూర్తవ్వగానే తాము చెన్నై తిరిగి వస్తామని జ్యోతిక వెల్లడించింది.

ఆస్తులు

సూర్య‌, జ్యోతిక 2006లో వివాహం చేసుకున్నారు. కాగా.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వాళ్లు దాదాపు రూ.537 కోట్ల ఆస్తుల‌ను సంపాదించారు. దాంట్లో జ్యోతిక నికర ఆస్తుల విలువ దాదాపు రూ.331 కోట్లు. సూర్యతో ఆమె కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 61.63% ఆమె సొంతం అని తెలుస్తోంది. ఇక సూర్య ఆస్తి దాదాపు రూ.206 కోట్లుగా తెలుస్తోంది. 2014లో సూర్య నిక‌ర ఆస్తుల విలువ రూ.125 కోట్లు కాగా.. ఈ ప‌దేళ్ల‌లో ఆయ‌న ఆస్తులు దాదాపు 60 శాతం పెరిగాయి. ఇక సూర్య‌, జ్యోతిక‌కి ఇద్ద‌రికి ల‌గ్జరీ కార్లు కూడా ఉన్నాయ‌ట వాళ్ల‌కి బీఎండ‌బ్ల్యూ సిరీస్ 730ఎల్డీ కారు ఉంది. దాని విలువ దాదాపు రూ.1.38 కోట్లు. రూ.80 ల‌క్ష‌ల విలువ గ‌ల ఆడీ క్యూ7, రూ.60 ల‌క్ష‌ల విలువ గ‌ల మెర్సిడెస్ బెంజ్, దాదాపు కోటిన్న‌ర విలువ గ‌ల జాగ్వార్ కార్లు ఉన్నాయి. ఇక చెన్నైలో దాదాపు 20 వేల స్క్వేర్ ఫీట్స్ లో ఇల్లు కూడా ఉంది.

చాలా కాలంగా సినిమాల‌కి గ్యాప్ ఇచ్చి, మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన జ్యోతిక వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇటీవ‌ల ఆమె న‌టించిన ‘సైతాన్’ సినిమా హిట్ టాక్ అందుకుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ప‌ర్వాలేదు అనిపిస్తోంది. కాగా.. 1998లో ‘డోలీ సజాకే రఖ్నా’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జ్యోతిక దాదాపు 26 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Actor Surya

ఎంత క్యూట్‌గా ఉందో..

కోలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా ఈ జంట పేరుతెచ్చుకున్నారు. సూర్య,జ్యోతికకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. సూర్య, జ్యోతికల కూతురు, కొడుకుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య, జ్యోతికల కూతురు పేరు దియా అలాగే కొడుకు వేరు దేవ్.ఇటీవలే ఈ చిన్నారి ఇంటర్ లో టాప్ మర్క్స్ సాధించింది. తాజాగా దియా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా సూర్య ఫ్యామిలి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో సూర్య కూతురు దియా హైలైట్ గా నిలిచింది. తల్లిని మించిన అందంతో దియా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దియా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని సూర్య, జ్యోతిక ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

కూతురు చదువులో స్టార్..

ప్రస్తుతం తల్లిదండ్రులు సూర్య, జ్యోతిక కూతురి మార్కులు చూసి సంతోష పడుతున్నారు. తమ ఆనందాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. కాగా, సూర్య అగరం ఫౌండేషన్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇది వేలాది మంది నిరుపేద పిల్లలకు వారి చదువులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ స్కూల్లో చదువుకున్న అనేక మంది విద్యార్ధులు వైద్యులుగా, ఇంజనీర్లుగా రాణిస్తున్నారు. మరికొంత మంది లా విద్యను అభ్యసిస్తున్నారు.

హీరో పిల్లలు కూడా కష్టపడి చదివి ఆదర్శంగా నిలుస్తున్నారని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’లో ‘రోలెక్స్’ పాత్రలో నటించిన సూర్యకు అద్భుతమైన ఆదరణ లభించింది. అతను ప్రస్తుతం బాల దర్శకత్వంలో ‘సూర్య 41’ షూటింగ్‌లో ఉన్నాడు, తరువాత సిరుత్తై శివ, సుధా కొంగర, వెట్రిమారన్ (వాడివాసల్), లోకేష్ కనగరాజ్ (‘విక్రమ్ 3’) మరియు ‘అయలాన్’ ఫేమ్ రవికుమార్ ఆర్‌లతో ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.

🔴Related Post

Leave a Comment