Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం దేశంలోనే టాప్ హీరోల్లో ఒకరు. పూర్తిస్థాయి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోగా ఆయన తన రేంజ్ చూపిస్తున్నారు. హీరోగా ఆయన మొదటి సినిమా ‘గంగోత్రి’ అన్న విషయం అందరికీ తెలిసిందే. కమర్షియల్ హిట్ తో పాటు మ్యూజికల్ హిట్ గానూ ఆ సినిమా నిలిచింది. తొలి సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్… ఆ తర్వాత ‘ఆర్య’, ‘బన్నీ’ లాంటి సినిమాలతో హీరోగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘పుష్ప 2’పై దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. నిజానికి ఒక్కో సినిమాతో ఒక్కో స్టైల్ ను మెయింటైన్ చేస్తూ.. తన హవాను కొనసాగిస్తున్న బన్నీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజుకు 20 ఏళ్లయింది. ఈ సందర్భాన్ని ఆయన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
ఫ్లవర్ అనుకుంటివా.. ఫయరు
‘‘ఈ రోజుతో నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నన్ను ఆశీర్వదించారు. ప్రేమతో ముంచెత్తారు. సినీ పరిశ్రమకు చెందిన నా వారందరికీ నేను కృతజ్ఞుడిని. ప్రేక్షకులు, ఆరాధకులు, అభిమానుల ప్రేమ వల్లే నేనిలా ఉన్నా. ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఏడాదిన్నర కిందట పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ‘తగ్గేదేలా’.. ‘పుష్ప అంటూ ఫ్లవర్ అనుకుంటివా.. ఫయరు’ అంటూ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 మూవీకి ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. తొలుత మూవీకి డివైట్ టాక్ వచ్చింది. కానీ, ఉత్తర భారతంలో మాత్రం పుష్ప-2 మూవీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 కు వచ్చిన రెస్పాన్స్ కంటే అటు నార్త్ ఇండియాలోనే మూవీకి అత్యధికంగా కలెక్షన్లు వస్తున్నట్లు సమాచారం.తాజాగా పుష్ప-2 సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబురాలు చేసుకుంటున్నారు. ఏపీలోని పాలకొల్లులో బన్నీ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి మరీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళి, తెలుగు పరిశ్రమల నుంచి సపోర్ట్ వచ్చింది.
Also Read : శోభన్‌బాబు, జయలలిత పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే .. ?
ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి థాంక్స్ అని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. ఒక సినిమా సక్సెస్ ని అన్ని స్టేట్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇది నా విజయం కాదని ఇది దేశం విజయం అని అన్నారు అల్లు అర్జున్. ఒక పుష్ప రాజ్ గా కాదు ఒక ఇండియన్ గా చెబుతున్నా ఇండియా లీడింగ్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ అని అన్నారు. స్పీచ్ లో భాగంగా మేరా భారత్ మహాన్ అని అన్నారు అల్లు అర్జున్. పుష్ప 2లో ఫేవరెట్ మూమెంట్ గురించి చెబుతూ యాటిట్యూడ్ ఆఫ్ ఎవరీ ఇండియన్. అందుకే సినిమా చేస్తున్న ప్రతి సందర్భంలో తగ్గేదేలేదు అనుకున్నా అన్నారు.
నాన్ బెయిలబుల్..
అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. తాజాగా హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీసులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హ* లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ లవ్ స్టోరీ
స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ వివాహం 2011 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగింది.ఈ క్రమంలోనే 13వ పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్య స్నేహారెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూ అల్లు అర్జున్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ స్నేహ లవ్ స్టోరీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అల్లు అర్జున్ తన లవ్ స్టోరీ ముందుగా ఒక హీరోయిన్ తో చెప్పారని తెలుస్తోంది.ఆ హీరోయిన్ మరెవరో కాదు సమంత…..2011 వ సంవత్సరంలో మార్చి ఆరవ తేదీన పెద్దలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. టాలీవుడ్ చరిత్రలోనే ప్రతి ఒక్కరూ మెచ్చే నచ్చే విధంగా అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది.
ఇక వీళ్ళ వివాహ వేడుకకు ఎంతోమంది సినీ పెద్దలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించక ముందే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ తనకు సంబంధం చూసిందట.. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను స్నేహారెడ్డిని తప్ప ఎవరిని చేసుకోనని చెప్పడంతో.. ఆమె ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయిందట.. సరే నీ ఇష్టం చేసుకుంటే చేసుకో స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకో నాకు ఇష్టమే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం..ఓకే కానీ.. నేను పెట్టిన కండిషన్ నువ్వు ఒప్పుకుంటేనే ఆమెను మన ఇంటికి కోడలుగా తీసుకురావడానికి ఒప్పుకుంటానని షాకింగ్ కండిషన్ పెట్టిందట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తల్లి నిర్మల గారు.కచ్చితంగా పెళ్లయిన సంవత్సరంలోపే నా చేతిలో మనవడినో లేక మనవడానిలో పెట్టాలని కచ్చితంగా అంతే కాదు నేను చెప్పిన ఈ కండిషన్ కి మీరు ఒప్పుకుంటేనే స్నేహారెడ్డిని చేసుకోవడానికి నేను అంగీకరిస్తానని చెప్పడంతో.. స్నేహా రెడ్డి కూడా ఆ కండిషన్ కి సరే అని ఒప్పుకున్నదట.
బన్నీ కూడా ఎంతో కష్టపడతారు..
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ మామ, స్నేహరెడ్డి తండ్రి అయిన చంద్రశేఖర్ గారు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి అలాగే బన్నీ కట్నం మేటర్ గురించి చెప్పుకొచ్చారు.“అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తాను. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారు. చిరంజీవి అడుగుజాడల్లో బన్నీ కూడా ఎంతో కష్టపడతారు” అంటూ చెప్పుకొచ్చిన చంద్రశేఖర్..‘పెళ్లి టైములో బన్నీకి కట్నం ఏమీ ఇవ్వలేదు. వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం తన పిల్లల ఆలనా పాలన వారి బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే అల్లుస్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. నిజం చెప్పాలంటే హీరోయిన్ రేంజ్ పాపులారిటీని ఈమె సొంతం చేసుకుందని చెప్పాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా వెరైటీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకొని పెద్ద ఎత్తున ఫోటోషూట్ లో నిర్వహిస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
Also Read : మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములుకాదని మీకు తెలుసా ..
ఈ చీర ఖరీదు ..
ఇలా వరుస ఫోటో షూట్లతో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్న స్నేహ రెడ్డి తాజాగా ఒక సిల్వర్ కలర్ చీరలో ఫోటోషూట్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే స్నేహ రెడ్డి ధరించిన ఈ సిల్వర్ రంగు చీర ప్రముఖ డిజైనర్ రిమ్జిమ్ దాదు రూపొందించిన ఈ చీరను మెటాలిక్ కార్డ్స్ తో తయారు చేశారు.సిల్వర్ కార్డ్ స్ట్రాప్‌లెస్ ట్యూబ్ బ్లౌజ్ ఉన్న వెండి చీర చాలా ఖరీదైనదని తెలుస్తోంది. ఇలా ఈమె ధరించిన ఈ చీర ఖరీదు రూ.1,76,000 అని తెలుస్తోంది ఇలా ఒక్క చీర కోసం లక్షల ఖర్చు చేశారని తెలియడంతో ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్నేహరెడ్డి మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఆస్క్ మీ ఎనీ థింగ్ అంటూ పెట్టేసింది. ఇక మొదటి సారిగా అల్లుస్నేహ రెడ్డి ఇలా అభిమానులతో చిట్ చాట్ చేయడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈమె పై ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినప్పటికీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాత్రం వెల్లడించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఏ ఫుడ్ అంటే ఇష్టం తనకు ఏ రంగు అంటే ఇష్టం అనే విషయాల గురించి స్నేహ తెలిపారు. తనకు రెడ్ కలర్ అంటే ఎంతో ఇష్టమని అలాగే ఇష్టమైన ప్రదేశం లండన్ అని స్నేహ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ కి ఇష్టమైన ఫుడ్ బిర్యాని అని స్నేహ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ప్రమేయం..
అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ లో తన ప్రమేయం ఏమీ లేదన్నారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే నని ఆయన పేర్కొన్నారు.. కేసు దర్యాప్తులో నా జోక్యం ఏమీ ఉండదని.. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకున్నారని సీఎం అన్నారు.ప్రాథమిక దర్యాప్తులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇన్చార్జి గంధకం విజయ చందర్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిసెంబర్ 5న భాస్కర్ ఈ ఫిర్యాదు చేశాడు. ఈ తొక్కిసలాట ఘటనపై విచారించిన పోలీసులు డిసెంబర్ 9న సంధ్య థియేటర్ మేనేజర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇదే కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.