Shobhan Babu | శోభన్‌బాబు, జయలలిత పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే .. ?

Written by admin

Published on:

Shobhan Babu | తెలుగు సినిమా చరిత్రలో అందగాడు అంటూ ఓ లిస్ట్‌ రాయడం మొదలుపెడితే తొలి పేరు శోభన్‌ బాబు అవుతుంది. ఈ మాట మేం అనేది ఆనాటి సినిమా అభిమానులు, ఈ నాటి సినిమా పరిశీలకులు చెప్పే మాట ఇది. తెలుగు హీరోలు అంటే ఓ రకంగా ఉంటారు అనే ఆలోచనను పటాపంచలు చేసిన కథానాయకుడు ఆయన. అందంలో హాలీవుడ్‌ హీరోలు ఆయన ముందు దిగదిడుపే అనేవారట ఆ రోజుల్లో సినిమా ఫ్యాన్స్‌. నటన పరంగా ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నా అందంలో మాత్రం ఆయనే గ్రేట్.అలాగే తెలుగు తెరపై వన్‌ అండ్‌ ఓన్లీ సోగ్గాడు ఆయనే. ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా సినిమాలు చేయడంలో శోభన్‌బాబుకి, మిగిలిన హీరోలకు ఒక స్పష్టమైన తేడా ఉంది.

అందుకే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులకు సాధ్యంకానిది శోభన్‌బాబుకి సాధ్యమైంది. శోభన్‌బాబు తన కెరీర్‌లో ప్రారంభంలో యాక్షన్‌ సినిమాలు చేశారు. మల్టీస్టారర్స్ చాలానే చేశారు. అయితే తనకంటూ ఓ స్టార్‌డమ్‌, ఇమేజ్‌, మార్కెట్‌ ఏర్పడ్డాక తన అభిమానుల కోసం సినిమాలు చేశారు. వారికి నచ్చే సినిమాలు చేశారు. యాక్షన్‌ మూవీస్‌ వెంట పరిగెత్తలేదు. ఒకటి అర అవికూడా చేస్తూనే ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేశారు.భార్యాభర్తల అనుబంధం, వారి మధ్య వచ్చే గొడవలు, మొగుడూ పెళ్లాం మధ్య సంఘర్షణలు, అలకలు, రెండో భార్య ఉండటం. ఏ పరిస్థితుల్లో ఆయన రెండో భార్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరో అమ్మాయికి ఎందుకు ఆకర్షితుడు కావాల్సి వచ్చింది అనే అంశాల ప్రధానంగా శోభన్‌బాబు సినిమాలు చేయడం విశేషం. ఇవి మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా కనెక్ట్ అవుతాయి.Shobhan Babu

Shobhan Babu

శోభ‌న్ బాబు వార‌సులు:

శోభ‌న్ బాబు 15 మే 1958న శాంతకుమారిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కరుణాశేష్ ఉన్నారు. శోభ‌న్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ, తన కొడుకును ఎప్పుడూ సినిమా పరిశ్రమకు పరిచయం చేయలేదు. అతడిని విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చాడు. వార‌సుడు ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని అనుభవించాడు. శోభన్ బాబు, కేవీ చలం ప్రాణ స్నేహితులు.. కేవీ చలం చనిపోయే వరకు ఆ తర్వాత చంద్రమోహన్‌తో చివరి శ్వాస వరకు సన్నిహిత స్నేహాన్ని కొన‌సాగించారు.

అతడు తన కార్మికులకు (డ్రైవర్, చెఫ్‌లు మొదలైనవి) ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన మంచి మ‌నిషి. వారిని ఆర్థికంగా బాగా స్థిరపరిచారు. ఆస్తులు, పెట్టుబడులు కొనుగోలు విషయంలో సినీ నటులకు విలువైన సూచనలు కూడా ఇచ్చేవారు. నటుడు మురళీ మోహన్ ముఖ్యంగా శోభ‌న్ బాబు సూచనలను అనుసరించి బాగా స్థిరపడ్డారు. చాలా ముందు చూపుతో భూములపై పెట్టుబ‌డులు పెట్ట‌మ‌ని సూచించిన తొలి త‌రం స్టార్ హీరో ఆయ‌న‌.

శోభన్ బాబు ఆస్తులు

శోభన్ బాబు ఈయన దగ్గర ఉన్న డబ్బు ప్రస్తుతం ఏ ఒక్కరి దగ్గర లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ప్రముఖ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన దగ్గర ఉన్న ఆస్తి కనుక లెక్క వేస్తే ప్రస్తుతం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని మురళీమోహన్ వెల్లడించారు. శోభన్ బాబు అతిపెద్ద బిజినెస్ కావడంతో చాలా ప్రదేశాలలో కొన్ని వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారట.ఇక శోభన్ బాబు మరణించే సమయానికి సుమారుగా ఆయన దగ్గర రూ.85 వేల కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం. Shobhan Babu

Also Read : మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములుకాదని మీకు తెలుసా ..

ముఖ్యంగా 1976లో కొన్ని మేజర్ కంపెనీలలో షేర్లు కూడా తీసుకున్నారట. చెన్నై శివారులలో ఆయనకు సంబంధించి కొన్ని వేల ఎకరాల స్థలాలు ఉన్నాయి అని మురళీమోహన్ వెల్లడించారు. ఇక శోభన్ బాబు ఆస్తుల గురించి తెలియజేయాలి అంటే ఆయన కాలక్షేపం కోసం తన ఎస్టేట్ ను చూడడానికి ఉదయం బయలుదేరితే తిరిగి రావడానికి సాయంత్రం అయ్యేదట. ఇక దీన్ని బట్టి చూస్తే ఆయన ఆస్తి విలువ ఎంతో మనం ఊహించవచ్చు. ఇక ప్రస్తుతం అవన్నీ లెక్కలు వేస్తే ఇప్పుడున్న మిలియనీర్ లాంటి వారు కూడా ఈయన ఆస్తి ముందు దిగదుడుపే అని చెప్పడంలో సందేహం లేదు.

Shobhan Babu

చిరుతో నో

అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే అందరూ ఎగిరి గంతేస్తారు. ఆయన సినిమాల్లో నటించడంద్వారా తమకు కూడా మంచి గుర్తింపు వస్తుందని, పాపులర్ అవుతామని భావిస్తారు.చిరు కథానాయకుడిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం మాస్టర్. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను రచయిత, దర్శకుడు తీర్చిదిద్దారు. ఈ క్యారెక్టర్ లో మంచి క్రేజ్, ఇమేజ్ ఉన్న హీరో నటిస్తేనే బాగుంటుందని భావించారు. దీంతో ఈ క్యారెక్టర్ లో నటించేందుకు శోభన్ బాబును సంప్రదించింది చిత్ర యూనిట్. అయితే ఆయన నో చెప్పారు. దీంతో చిరంజీవి స్వయంగా శోభన్ బాబుతో మాట్లాడారు. మీరుచేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని, చేయాలంటూ విన్నవించారు. సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, కాబట్టి నటించలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని శోభన్ బాబు అన్నారు.

కృష్ణ తో చెయ్యకూడదని డిసైడ్‌

మల్టీస్టారర్స్‌ విషయంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చుకున్న జంట కృష్ణ, శోభన్‌బాబు. వయసు రీత్యా, కెరీర్‌ పరంగా కృష్ణ కంటే శోభన్‌బాబు సీనియర్‌. కృష్ణ కంటే నాలుగు సంవత్సరాల ముందే శోభన్‌బాబు ఇండస్ట్రీకి వచ్చారు. అందుకే శోభన్‌బాబును ఎంతో గౌరవించేవారు కృష్ణ. వీరిద్దరూ కలిసి మొదట నటించిన సినిమా ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ఓ అరడజను సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా ‘మహా సంగ్రామం’. మొత్తంగా చూస్తే ఇద్దరూ కలిసి 17 సినిమాలు చేశారు. 1973 తర్వాత ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ మొదలైంది. ఒకరిని మించి ఒకరు హిట్లు కొడుతూ దూసుకెళ్ళేవారు. ఇక్కడ కూడా ఇద్దరికీ అభిమాన సంఘాలు ఏర్పడడం, తమ హీరోల సినిమాల గురించి అభిమానులు చర్చా వేదికలు పెట్టుకోవడం వంటివి విరివిగా జరిగేవి.

శోభన్ బాబు హెయిల్ స్టయిల్

అప్పటిలో హీరోగా ఉన్న కృష్ణ హెయిర్ స్ట‌యిల్‌.. శోభ‌న్‌బాబు హెయిర్ స్ట‌యిల్ కూడా ఒకేర‌కంగా ఉండ‌డంతో దాస‌రి.. శోభ‌న్‌బాబు హెయిర్ స్ట‌యిల్‌ను మార్చాల‌ని నిర్ణ‌యించారు. కానీ, కుదిరే ప‌నికాదు! ఏం చేయాలి. దీనికి శోభ‌న్‌బాబు కూడా అంగీక‌రించ‌లేదు. దీంతో ఎట్ట‌కేల‌కు.. నుదురుపై వంకీగా జుట్టు కొస‌లు లాగి..ఇదే నీస్ట‌యిల్‌! అని చెప్పారు ద‌ర్శ‌ర‌త్న. అయితే.. ముందు దీనికి కూడా ఒప్పుకోని శోభ‌న్ బాబు త‌ర్వాత‌.. ఈ స్ట‌యిల్ హెయిర్‌డ్ర‌స్‌తో న‌టించిన సినిమా హిట్ కావ‌డంతో అప్ప‌టి నుంచి దీనిని కొన‌సాగించారు. అప్పటిలో ప్రతి అబ్బాయి శోభన్ బాబు హెయిల్ స్టయిల్ ను ఫాలో అవే వారు. ఇప్పటికి కొన్ని సినిమాల్లో శోభన్ బాబు స్టయిల్ ను కొనసాగిస్తున్నారు.Shobhan Babu

Also Read : నట ప్రస్తావనకు 56 ఏళ్ళు.. ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా ,

Shobhan Babu

జ‌య‌ల‌లిత కోసం..

ఇదిలావుంటే.. త‌మిళంలోనే కాకుండా.. తెలుగులోనూ.. బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాయించుకున్న జ‌య‌ల‌లిత శోభ‌న్‌బాబుతో ఏర్ప‌రుచుకున్న సంబంధంపై ఇప్ప‌టికీ అనేక క‌థ‌నాలు వ‌స్తుంటాయి. వీరి బంధానికి గుర్తుగా చిన్నారి ఉంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇక‌, తెలుగు ఇండ‌స్ట్రీ అంతా కూడా.. హైద‌రాబాద్‌కు వ‌చ్చేయ‌డంలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.ఆ తరువాత శోభన్ బాబులో ఉన్న నిరాడంబరత తనను ఇష్టపడుతున్న విధానం జయలలితకు కూడా నచ్చింది. అలా వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలలో నటించారు వాళ్ళిద్దరు మంచి హిట్ ఫెయిర్ అన్న పేరు కూడా వచ్చేసింది. Shobhan Babu

ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.అయితే అప్పటికే శోభన్ బాబుకు పెళ్లి జరిగింది.. పిల్లలు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎంజీఆర్ రాజకీయాల్లోకి రావడం జయలలిత ఎంజీఆర్ కు సాన్నిహిత్యం కావడంతో ఆమె మనసు మారిందని అంటారు. వాస్తవంగా జయలలిత.. శోభన్ బాబును రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధంగానే ఉందని అనేవారు. ఎప్పుడు అయితే ఎంజీఆర్ తో సాన్నిహిత్యం ఏర్పడిందో రాజకీయాల్లోకి వెళితే మరింత క్రేజ్ వస్తుందన్న ఆలోచన ఆమె మదిలో కలిగిందో అప్పటినుంచి క్రమక్రమంగా శోభన్ బాబు – జయలలిత బంధం బీటలు వారిందంటారు.Shobhan Babu

ఈ స‌మ‌యంలో శోభ‌న్‌బాబుకు (Sobhan Babu) స్టూడియో క‌ట్టుకునేందుకు అన్న‌గారు హైద‌రాబాద్ లో స్థ‌లాన్ని చూపించారు. దీనికి ఆయ‌న కూడా ఒప్పుకొన్నారు. అయితే.. త‌మిళ‌నాడును వ‌దిలి వెళ్లొద్ద‌ని.. జ‌య ల‌లిత పెట్టిన ఆంక్ష‌తో శోభ‌న్‌బాబు నిలిచిపోయార‌ని.. అందుకే ఆయ‌నకు హైద‌రాబాద్‌లో ఒక ఇల్లు త‌ప్ప (ఇప్పుడు అది కూడా లేదు) ఏమీ లేద‌ని ప్ర‌చారంలో ఉంది. జ‌య‌ల‌లిత కోసం.. శోభ‌న్‌బాబు చేసిన త్యాగాల్లో మ‌రొక‌టి.. కీల‌క‌మైన సినిమాలు వ‌ద‌లుకోవడం.

సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేసినప్పటికీ శోభన్‌బాబు మద్రాసులోనే ఉండిపోయారు. ఓసారి కోదండరామిరెడ్డి మద్రాస్ వెళ్లినప్పుడు శోభన్‌బాబును కలిశారట. ఏంటి సినిమాలు చేయడం లేదు.. నీ అభిమానులు ఫీలవుతున్నారు.. అని కోదండరామిరెడ్డి అడిగారట. అందుకు ఆయన స్పందిస్తూ..‘ ఆ అందాల నటుడు శోభన్‌బాబు ఎప్పుడో చనిపోయాడు. జుట్టు ఊడిపోయి, ముడతలు పడిన శరీరంతో నేను తెరపై కనిపించడం ఇష్టం లేదు. అందుకే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. నా అభిమానులు వచ్చినప్పుడు కూడా… ‘నేనింక సినిమాల్లో నటించను, ఎంతో దూరం నుంచి నా కోసం రాకండి’ అని చెప్పేశానంటూ కోదండరామిరెడ్డితో చెప్పారంట శోభన్‌బాబు.Shobhan Babu

Also Read : సూర్య ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఏఐ వీడియో నెట్టింట వైరల్ ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. ఆంధ్రుల అందగాడు..తెలుగు ప్రేక్షకుల సోగ్గాడు దివంగత హీరో శోభన్ బాబుకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ సాయంతో ఈ వీడియోను రూపొందించినట్లుగా చూస్తుంటే అర్థమవుతుంది. సముద్రం ఒడ్డున శోభన్ బాబు చాలా స్టైలీష్‏గా.. రాయల్ గా నడుస్తూ వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో శోభన్ బాబు కటౌట్ హాలీవుడ్ రేంజ్‏లో కనిపిస్తుండగా.. ఏఐ టెక్నాలజీ సాయంతో శోభన్ బాబు ముఖాన్ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సోగ్గాడు మళ్లీ ఇన్ స్టా యుగంలో జన్మిస్తే ఇలా ఉంటాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.Shobhan Babu

🔴Related Post

Leave a Comment