Naga Chaitanya | టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే .సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెకు పలు వ్యక్తిగత విషయాల కారణంగా విడాకులు ఇచ్చారు.
ఫ్రెండ్‌గా, లవర్‌గా హీరోయిన్..
ఇదిలా ఉంటే నాగ చైతన్య తో ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, హీరోయిన్ గా నటించింది. ఆ అమ్మడు ఎవరో తెలుసా.? సినిమాల్లో ఇలా జరగడం చాలా కామన్. ఓ సినిమాలో హీరో పక్క న హీరోయిన్ గా నటించిన అవారే ఆతర్వాత అదే హీరోకు వదినగానో..లేక తల్లిగానో నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు నాగ చైతన్య తో కూడా ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, లవర్ గా చేసింది.
ఆమె లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆయనకు భార్యగా నటించింది. ఆతర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగ్ కొడుకుగా నాగ చైత్యన నటించాడు. అలాగే మనం సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది. మనం సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా యుద్ధం శరణం అనే సినిమాలో చేశారు. ఇలా నాగ చైతన్యతో లావణ్య త్రిపాఠీ అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా నటించి మెప్పించింది.
నాగచైతన్య రెండో పెళ్లి
నాగచైతన్య, నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వారి నిశ్చితార్థం కూడా ఆగస్టు 8న జరిగింది. అయితే వారి పెళ్లి రాజస్థాన్ లో జరుగనున్నట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీ మాత్రం వెల్లడి కాలేదు.అయితే నాగచైతన్య, శోభిత తమ పెళ్లి కోసం రాజస్థాన్ లో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ను ఎంచుకున్నారని వినికిడి. శోభిత వాస్తవానికి వైజాగ్ కు చెందిన యువతి. కానీ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె రాజస్థాన్ లో తన పెళ్లిని కోరుకుంటుందని తెలిసింది. కాగా అక్కినేని నాగర్జున మాత్రం పెళ్లికి ఇప్పుడప్పుడే తొందర లేదని ‘టైమ్స్ నౌ’ కు తెలిపారు. సమంత తో విడిపోయాక నాగచైతన్య దిగాలు పడ్డాడు. కానీ ఇప్పుడు కోలుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు.
Also Read : ఇంత వయస్సు వచ్చిన అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరంటే..?
చైతూ నికర ఆస్తులు ..
నాగచైతన్య నికర ఆస్తులు రూ.154 కోట్లు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జున నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అంతకు ముందు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని తాను కొనసాగిస్తూ వస్తున్నారు. శోభిత దూళిపాళ నికర ఆదాయం ఏడు నుంచి పది కోట్లు మాత్రమే. నాగచైతన్య ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్లు తీసుకుంటారని సమాచారం. అయితే చైతూకు వరుస హిట్లు పడితే ఈ ఫిగర్స్ మారతాయి. హిట్స్ అండ్ ఫ్లాప్స్ ను బట్టి ఈ ఫిగర్లు ఒక్కోసారి తగ్గవచ్చు..పెరగవచ్చు.. అంటే ఓవరాల్ గా రూ.5 నుంచి రూ.10 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటారు నాగచైతన్య.
2022లో నాగచైతన్య క్లౌడ్ కిచెన్ షోయు ఫ్రాంచెయిస్ ప్రారంభించారు.ఉత్తరాది, దక్షిణాది వంటకాలను తయారు చేయించి వివిధ స్టార్ హోటళ్లకు సప్లై చేస్తారు. 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ ప్రారంభించారు. సోషల్ మీడియా ఇన్ స్టాలో 7.4 మిలియన్ ఫాలోవర్స్ కలిగివున్న నాగచైతన్య సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ పాటిస్తుంటారు. మైంత్ర,ఎయిర్ టెల్, క్లోజప్ పేస్ట్ వంటి కమర్షియల్ యాడ్స్ లో నటించారు.
వీటితోపాటు ఆదిత్య బిర్లా గ్రూప్ నకు సంబంధించిన తాస్య,తరుణ్ తహిలానీ, ఐస్ క్రీమ్ బ్రాండ్ మాగ్నమ్ ఇండియా, ఫర్నిచర్ బ్రాండ్ దాసోస్ కేబినెట్స్ తదితర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. నాగచైతన్య 2023తో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. సమంత, చైతూ ఇద్దరూ ఆ ఇంట్లో కొంతకాలం ఉన్నారు. నాగార్జున కూడా రూ.45 కోట్లు ఖరీదు చేసే ఇంటిలో నివాసం ఉంటున్నారు.
శోభిత ఆస్తులు
నిజానికి శోభిత ధూళిపాళ్ల పేరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. కానీ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. తెనాలిలో జన్మించిన ఈ అందాల తార జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఆమె కూడా ఆమ్స్ బిజినెస్ మెన్ కూతురు అని వార్తలు వచ్చాయి. అలాగే ఇంచుమించు నాగచైతన్యకు తగ్గట్టుగా ఆస్తులు ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చాయి.నిజానికి ఆ వార్తల్లో నిజం లేదు. ఆమె తండ్రి వేణుగోపాలరావు మెర్చంట్ నేవీ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి శాంతా కామాక్షి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. ముమ్మాటికి సాదాసీదా తెలుగు కుటుంబం నుంచి వచ్చిన శోభిత, తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో పెరిగింది.
అక్కినేని వారి ఆస్తులతో పోలిస్తే వారి ఆస్తులు చాలా తక్కువ. కానీ నాగచైతన్య కేవలం ఆమెతో జీవితం బాగుంటుందని మాత్రమే ఆలోచించి పెళ్లికి సిద్ధమయ్యాడు.సోభిత ధూళిపాళ్లకు మంచి శిక్షణ పొందిన విద్యార్థిని మాత్రమే కాదు, ఆమె అందాల పోటీలలో కూడా విజయాన్ని సాధించింది. ఆమె మొదటిసారి పాల్గొన్న బ్యూటీ పేజెంట్ ఆర్మీ ఈవెంట్ లో జరిగింది. ఆ తర్వాత, 2013 లో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె సినీరంగంలో 2016లో అడుగు పెట్టింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాలో విక్కీ కౌశల్ సరసన ఆమె తొలిసారిగా నటించింది.
‘తండేల్’ అంటే..?
అక్కినేని నాగ చైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నారు.నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ‘100 పర్సెంట్ లవ్’ నిర్మించింది.
ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జోడీ కడుతోంది. తాజాగా తండేల్’ అంటే ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
గుజరాతీ భాషలో ‘తండేల్’ అంటే బోటు నడిపే ఆపరేట్ అని అర్థం అన్నారు. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. బతుకుతెరువు కోసం గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది.|Naga Chaitanya
తాజాగా అక్కినేని నాగచైతన్య పెళ్ళికి సంబందించిన మరో ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గరుండి నాగ చైతన్య వివాహం జరిపించారు. చైతు పెళ్లి ఫోటోలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అయితే తాజాగా వెంకటేష్ చైతును పెళ్ళికొడుకు చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసారు. ఇక ఇందులో చైతన్య కన్న తల్లి కూడా మెరిశారు. నాగచైతన్య నాగార్జున మొదటి భార్య కొడుకు అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.ఇక నాగార్జున పెళ్లి సమయంలో ఆమె దగ్గరుండి నాగచైతన్యను పెళ్లి కొడుకు చేయించారు. ఈ సందర్బంగా వెంకటేష్ తల్లి, కొడుకుల ఫోటోలు షేర్ చేసారు.
Also Read : అప్పట్లో నాకు ఆరుగురు భర్తలు .. నటి అన్నపూర్ణ
ఓక్క పోస్ట్ పెట్టలేదు..
సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య కి స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు కచ్చితంగా తగులుతాయి అంటూ మాట్లాడుతున్నారు జనాలు . సమంత – నాగ చైతన్య బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . వీళ్ళు విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కడుపు రగిలిపోయేలా చేశారు . తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియడం ఇంకా ఇంకా సమంత ఫ్యాన్స్ కు మండిపోయేలా చేస్తుంది .తాజాగా సమంత తండ్రి మరణించారు .
అయినా సరే సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ పెట్టలేదు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. కనీసం సమంతకు కాల్ చేసి ధైర్యం కూడా చెప్పలేదు . దీంతో అక్కినేని ఫ్యామిలీ పై సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . అంతేకాదు తాజాగా సమంత తల్లి నాగచైతన్యకు శాపనార్ధాలు పెట్టింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య ఏమో ఒకపక్క సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే తన కూతురు మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తుంది అని .. తండ్రి కూడా మరణించడంతో సమంత ఇంకా డీలా పడిపోయింది అని సమంత ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
నాగార్జున మొదటి భార్యకు నాగ చైతన్య జన్మించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడి కూతురైన లక్ష్మీని నాగార్జున మొదట వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పుట్టిన సంతానమే చైతూ. చై పుట్టిన కొన్నాళ్లకు వ్యక్తిగత కారణాలతో నాగార్జున – లక్ష్మి విడాకులు తీసుకున్నారు.కానీ చైతూ మాత్రం తండ్రి నాగార్జున వద్దే పెరిగాడు. అయినా కూడా సమయం దొరికినప్పుడల్లా తన తల్లి వద్దకు వెళ్తుంటాడు. చైతూ పెళ్ళిలో లాంగ్ హెయిర్ తో కనిపించిన లక్ష్మి.. ఇప్పుడు మాత్రం గుర్తుపట్టనంతగా మారిపోయింది. తాజాగా చైతూ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న ఓ క్యూట్ పిక్ ని ఇన్ స్టా లో షేర్ చేశాడు.అందులో చైతూ తల్లి లక్ష్మి తక్కువ జుట్టుతో గుర్తుపట్టని విధంగా కనిపించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే అసలు ఈమె నాగ చైతన్య మదరేనా అని కామెంట్స్ చేస్తున్నారు.